Double Ismart : 'మార్ ముంత చోడ్ చింతా' సాంగ్ వచ్చేసింది.. కేసీఆర్ డైలాగ్ ను భలే వాడారుగా!

'డబుల్ ఇస్మార్ట్' నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'మార్ ముంత చోడ్ చింత' అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ లో రామ్ పోతినేని మరోసారి ఊరమాస్ స్టెప్పులతో రెచ్చిపోయాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ ఆలపించారు.

New Update
Double Ismart : 'మార్ ముంత చోడ్ చింతా' సాంగ్ వచ్చేసింది.. కేసీఆర్ డైలాగ్ ను భలే వాడారుగా!

Maar Muntha Chod Chinta Song Out From Double Ismart : ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గానే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ వదిలారు. 'స్టెప్పమార్' అంటూ సాగే ఈ పాటలో రామ్ మాస్ స్టెప్స్ తో రామ్ దుమ్ములేపాడు. దీంతో ఈ సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఫస్ట్ సింగిల్ ను మించి ఉంది. మార్ ముంత చోడ్ చింత అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ లో కావ్య థాపర్ తన హాట్ షోతో మతులు పోగొట్టేసింది. అలాగే రామ్ పోతినేని మరోసారి ఊరమాస్ స్టెప్పులతో రెచ్చిపోయాడు. ముఖ్యంగా ఈ సాంగ్‌ మధ్యలో మాజీ సీఎం కేసీఆర్‌ వాయిస్‌ డైలాగ్‌ (ఇప్పుడేం చేద్దాం అంటావ్ మరి) ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

Also Read : 1000 మంది డ్యాన్సర్స్ తో ‘కంగువ’ సాంగ్.. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారెంటీ!

అలాగే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన 'ఎంజాయ్ పండగల్' అనే డైలాగ్ ను సైతం సాంగ్ మధ్యలో చాలా గమ్మత్తుగా పెట్టారు. దీంతో ఫ్యాన్స్ ను ఈ సాంగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ ఆలపించారు. యంగ్ కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి డ్యాన్స్ కంపోజ్ చేశారు.ప్రస్తుతం ఈ పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisment
తాజా కథనాలు