Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' సాంగ్ వివాదం.. పూరీ జగన్నాథ్ పై కేసు నమోదు!
'డబుల్ ఇస్మార్ట్' మూవీ నుంచి రిలీజ్ అయిన ‘మార్ ముంత చోడ్ చింత’ సాంగ్ పై వివాదం నెలకొంది. సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ ను పెట్టడంపై బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సాంగ్ లో కేసీఆర్ వాడిన డైలాగ్స్‌ను తొలగించాలని డైరక్టర్ పూరీ జగన్నాథ్‌పై కేసు పెట్టారు.