Health News: నాలుగేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించింది. మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 70.36 కోట్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడగా, వారిలో 69.86 లక్షల మంది మరణించారు. ఇక ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారిని ఇంకా తీవ్రమైన సమస్యలకు వెంటాడుతున్నాయి. పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ కారణంగా ప్రజల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏడాదికి పైగా గుండె, జీవక్రియ, మెదడుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఊపిరితిత్తుల పనితీరు మారిందా?
- కొవిడ్ దుష్ప్రభావాలపై ఇటీవల జరిపిన అధ్యయనంలో ఊపిరితిత్తుల సమస్యల గురించి పరిశోధకులు కీలక విషయాలు చెప్పారు. కోవిడ్ తర్వాత భారతీయుల్లో ఊపిరితిత్తుల దెబ్బతిన్న కేసుల రేటు చాలా ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఊపిరితిత్తుల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇక కరోనా సోకిన వారిలో సగానికి పైగా ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:
- ఈ పరిశోధనలో పాల్గొన్న 207 మందిని పరిశీలించి వారిలోని సమస్యలను తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో భారతీయులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఇందులో 49.3 శాతం మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వ్యాధి తీవ్రత కేటగిరీలో ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ జనాభాలో ఊపిరితిత్తుల పనితీరు బాగా దెబ్బతిన్నదని పరిశోధనలు చెబుతున్నాయని మెడికల్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ పల్మనరీ మెడిసిన్ ప్రొఫెసర్ డిజె క్రిస్టోఫర్ చెప్పారు. అయితే ఇతర దేశాల కంటే భారతీయ జనాభాలో ఎక్కువ కోమార్బిడిటీలు ఉన్నందున ఊపిరితిత్తులు దెబ్బతినడానికి కచ్చితమైన కారణం స్పష్టంగా అర్థం కాలేదు.
ఇది కూడా చదవండి : ఇవి తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకండి.. ఎందుకంటే?
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.