Cylinder price: సిలిండర్‌ ధరల తగ్గింపుపై ట్విట్టర్‌లో యుద్ధం.. క్రెడిట్ల కోసం వెంపర్లాట.. అసలు మేటరేంటంటే?

వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వ భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రు.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించింది. అయితే INDIA కూటమికి భయపడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని యాంటి-బీజేపీ పార్టీలు విమర్శిస్తుండగా.. ఇదంతా మోదీ ప్రజల మంచి కోసం చేశారని బీజేపీ క్రెడిట్లు ఇచ్చుకుంటుంది. మరోవైపు మిగిలిన నిత్యావసర ధరలను కూడా తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.

New Update
Cylinder price: సిలిండర్‌ ధరల తగ్గింపుపై ట్విట్టర్‌లో యుద్ధం.. క్రెడిట్ల కోసం వెంపర్లాట.. అసలు మేటరేంటంటే?

 LPG price cut by Rs 200: క్రెడిట్‌ స్టీలింగ్‌ అన్నది ఆర్ట్.. అది అందరికి సాధ్యమయ్యే పని కాదు. కొందరు మాత్రమే అందులో ఎక్స్‌పర్ట్స్.. ముఖ్యంగా రాజకీయ నాయుకులు ఇందులో ఫస్ట్‌ ఉంటారు. ఏదైనా ప్రజలకు మంచి జరిగే విషయం ఉంటే అది తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. రక్షా బంధన్‌ గిఫ్ట్‌ అంటూ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 14కేజీల సిలిండర్‌పై 200రూపాయల వరకు తగ్గించింది. ఇది ప్రజలకు ఊరటనిచ్చే అంశమే.. ఎందుకంటే ఇప్పటికే నిత్యావసరాలు భగ్గుమంటున్నాయి.. మార్కెట్‌లో ఏం కొనేట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఇలాంటి సమయంలో సిలిండర్‌పై రూ.200 వరుకు తగ్గింపు అంటే మంచి విషయమే..అయితే ఈ అంశంలో క్రెడిట్లు తీసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటి పడుతున్నాయి. బీజేపీ, యాంటీ-బీజేపీ పార్టీలు తమ ఖాతాలో క్రెడిట్లు వేసుకునేందుకు ఎగబడుతున్నాయి.

బీజేపీ ఏం అంటుందంటే?

➡ ఎల్‌పీజీ వినియోగదారులందరికీ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించే సాహసోపేతమైన నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారు.

➡ 33 కోట్ల కనెక్షన్‌లుకు ఇది లాభం

➡ పిఎం ఉజ్వల యోజన వినియోగదారులు తమ ఖాతాల్లో రూ. 200 సిలిండర్ సబ్సిడీని పొందడం కొనసాగిస్తారు.. మోదీ నిర్ణయం అందరికి మంచి చేసింది

➡ మోది ప్రభుత్వం 75 లక్షల అదనపు ఉజ్వల కనెక్షన్‌లను ఆమోదించింది.

➡ మొత్తం PMUY లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకుంటుంది..


యాంటి-బీజేపీ నేతలు ఏం అంటున్నారంటే:

➡ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం INDIA కూటమి వల్లే జరిగింది

➡ గత రెండు నెలల్లో INDIA కూటమి రెండు సార్లు సమావేశమైంది.. అందుకే భయపడి బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.

➡ ఐదు రాష్ట్రాల ఎన్నికలు వస్తుండడంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకోని ఈ నిర్ణయం తీసుకుంది.

➡ ఎన్నికలకు ముందు ధరలు తగ్గించడం బీజేపీకి అలవాటే

➡ రూ.700 పెంచి రూ.200 తగ్గిస్తారా?


క్రెడిట్ల కోసం యుద్ధం:
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్‌ బీజేపీ తీసుకున్న నిర్ణయానికి ఎప్పటిలాగే మోదీకి క్రెడిట్లు ఇవ్వగా.. మరోవైపు పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. INDIA కూటమి ఐక్యంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుందని చురకలంటించారు. మరోవైపు ప్రజల నుంచి కూడా మిక్సిడ్‌ రియాక్షన్స్ వస్తున్నాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకి చాలా కాలం అయ్యిందని.. కేవలం సిలిండర్‌ ధరలను తగ్గించి చేతులు దులుపుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని కొంత మంది వాదిస్తుండగా.. ఏదో ఒకదానికైనా ధర తగ్గించారులే అని మరికొంతమంది రిలీఫ్‌ ఫీల్ అవుతున్నారు. ఇక మరికొంత మంది మాత్రం ఎన్నికల సమయంలో ధరల తగ్గింపులు గుర్తుకు వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. రక్షా బంధన్‌కి గిఫ్ట్ ఇచ్చినట్టే వినయక చవతి, దీపావళి, దసర పండుగలకు కూడా ధరలు తగ్గిస్తారా అని కౌంటర్లు వేస్తున్నారు.

ALSO READ: రక్షా బంధన్ గిఫ్ట్.. ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు.. ఎంతంటే?

Advertisment
తాజా కథనాలు