LPG Cylinder: రక్షా బంధన్ గిఫ్ట్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు.. ఎంతంటే?
వినియోగదారులకు గుడ్న్యూస్..రక్షా బంధన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. LPG సిలిండర్లపై ధరలు తగ్గునున్నాయి. ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ LPG సిలిండర్ల ధరలను రూ.200 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ ప్రయోజనం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.