Weather: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. రహదారులను కమ్మేస్తున్న పొగమంచు..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా గణనీయంగా పెరిగిపోతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో.. చలికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. మంచు దుప్పటి కమ్మేస్తోంది. రహదారులు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చలి తీవ్రత కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

New Update
Weather: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. రహదారులను కమ్మేస్తున్న పొగమంచు..

Weather Report of AP and TS: వరుసగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల ప్రజల గజగజా వణికిపోతున్నారు. బాబోయ్ ఇదెక్కడి చలిరా బాబూ అంటూ గది తలుపులు బిగ్గరగా వేసుకుంటున్నారు. గత రెండు వారాలుగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. చలి కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే.. సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చినా కూడా మంచు పొరలు అలాగే కమ్ముకుని ఉంటున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఘోరంగా ఉంటుంది. చలితో జనం వణికిపోతున్నారు. రహదారులను మంచు పొగ కమ్మేయడంతో.. వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

తెలంగాణలోనూ చలి తీవ్రత..

తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. మంచుదుప్పటి కింద రాష్ట్రం గజగజ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. భాగ్యనగరంను పొగమంచు కమ్మేసింది. శుక్రవారం నగరమంతటా మొత్తం పొగ మంచు ఆవరించింది. ట్యాంక్‌బండ్‌ చుట్టుపక్కల దట్టంగా మంచు కురిసింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో శనివారం కూడా అదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో అధికంగా మంచు కురుస్తుందని వెల్లడించింది.

Also Read:

అమ్మాయితో ఆ ఇద్దరు చాటింగ్.. కట్ చేస్తే నడిరోడ్డుపై ఘోరం..!

టార్గెట్ మేఘా కృష్ణా రెడ్డి.. కాళేశ్వరంలో అవినీతిపై మంత్రుల సంచలన కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు