Kaleshwaram Lift Irrigation Project: కాళేశ్వరం ప్రాజెక్టు పాపాల పుట్ట అని రాష్ట్ర మంత్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.50వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని తెలిపారు. కమీషన్ల కోసం నాసిరకంగా నిర్మాణాలు చేశారని కుండబద్దలు కొట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, మిగిలిన రెండు బ్యారేజీలకు బొక్కలు పడ్డాయని.. వాటి భద్రత కూడా ప్రశ్నార్థకమేనని ఫైరయ్యారు. ప్రాజెక్టు కూలిపోయిన ఘటనలో బాధ్యులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు తిన్న అవినీతి సొమ్ము మొత్తాన్ని కక్కిస్తామని హెచ్చరించారు. కాళేశ్వరంపై సీఎంతో చర్చించాక జ్యుడిషియల్ విచారణకు ఆదేశాలిస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వినోద్‌లు శుక్రవారం నాడు మేడగడ్డ బ్యారేజీని పరిశీలించారు. నీటిపారుదల శాఖ అధికారులకు పలు ప్రశ్నలు సంధించి వివరాలు తెలుసుకున్నారు. ఏడు పిల్లర్లు కుంగిపోయాయని తెలిపారు. కమీషన్ల కోసం మొత్తం నాసిరకం నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. బ్యారేజ్ నిర్మాణాలను పరిశీలిస్తే 3 ఏళ్ల క్రితం కట్టిన వాటిలా కనబడటం లేదని తెలిపారు. మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఖాళీగా ఉన్నాయని.. నీటిని నింపే పరిస్థితి లేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతి కంపు కొడుతోందని విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకూ దాదాపు 1 లక్ష 5వేల కోట్లు ఖర్చు చేశారని.. కేవలం లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం అప్పుల వడ్డీ భారమే ఏటా రూ.10వేల కోట్లు కట్టాల్సి ఉందని తెలిపారు. ఇది కాకుండా ప్రాజెక్టు నిర్వహణకు ప్రతి ఏటా మరో రూ.10వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. కేంద్ర జలసంఘం రూపొందించిన ప్రాజెక్టు అంచనాలను.. రూ.65వేల కోట్ల మేర పెంచి ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ప్రాజెక్టు పర్యటన వివరాలను సీఎంకు వివరిస్తామని.. తదుపరి చర్యలు చేపడతామన్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణపై ఇప్పుడేమీ చెప్పలేమని, నిపుణులతో చర్చించాకే ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana: కాళేశ్వరంలో రూ.50వేల కోట్లకు పైగా అవినీతి.. ఆ కాంట్రాక్టర్లు తిన్నది కక్కిస్తాం: మంత్రులు
కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ మంత్రులు. ప్రాజెక్టులో దాదాపు రూ. 50 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని స్పష్టం చేశారు. ప్రాజెక్టును కట్టిన వారే బాధ్యులు అని హెచ్చరించారు.
Translate this News: