Rains: బంగాళాఖాతంలో కాదు.. భూ ఉపరితలంపై అల్పపీడనం! సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే.అయితే గురువారం మాత్రం భూ ఉపరితలం పై అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్టణం వాతావరణశాఖ తెలిపింది. By Bhavana 08 Aug 2024 in Uncategorized New Update షేర్ చేయండి Rains: సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే.అయితే గురువారం మాత్రం భూ ఉపరితలం పై అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్టణం వాతావరణశాఖ తెలిపింది. ఐదు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ఫలితంగా మధ్య, ఉత్తర, వాయవ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. తాజాగా ఇప్పుడు తూర్పు, మధ్య భారతదేశంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. నిన్న ఉదయం పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం సాయంత్రానికి ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా, చత్తీస్‌గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం కూడా అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు మరోవైపు, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ఓ మోస్తరుగా కదులుతున్నందున బుధవారం కూడా అనేక చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. Also read: పతకం కాదు..మీరే నిజమైన ఛాంపియన్..వినేశ్‌కి అండగా టాలీవుడ్ సూపర్ స్టార్! #rains #ap #low-pressure #vizag మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి