Lok Sabha Elections 2024 : పోరుగల్లు.. ఓరుగల్లు నుంచి వరంగల్(Warangal) గా మారిన ఈ నియోజకవర్గంలో ఎన్నికలెప్పుడూ ఆసక్తికరంగానే వుంటాయి. కాకతీయ సామ్రాజ్య రాజధానిగా చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ తెలంగాణ(Telangana) లో రెండో అతిపెద్ద నగరం. ట్రిపుల్ సిటీ వరంగల్ రాజకీయ నేపథ్యం కూడా హిస్టారికలే. ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya University) రాష్ట్రానికి ఎందరో నాయకులను అందించింది. తెలంగాణ ఉద్యమకాలంలో ఉస్మానియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఎస్‌సీ రిజర్వ్‌డ్ స్థానం ఇది.
2019లో బీఆర్ఎస్(BRS) అభ్యర్ధి పసునూరి దయాకర్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి దొమ్మాటి సాంబయ్య రెండో స్థానంలో నిలిచారు.
ప్రస్తుతం కాంగ్రెస్(Congress) నుంచి కడియం కావ్య, బీజేపీ(BJP) నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి ఎమ్.సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్
కడియం కావ్య - సీనియర్ లీడర్ కడియం శ్రీహరి కుమార్తె. వృత్తిరీత్యా డాక్టర్. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
బీజేపీ
ఆరూరి రమేష్ - మాజీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడి బీజేపీలో చేరారు.
బీఆర్ఎస్
ఎమ్.సుధీర్ కుమార్ - హన్మకొండ జడ్‌పీ చైర్మన్‌గా ఉన్నారు.
గెలుపు అవకాశం: కాంగ్రెస్
రీజన్స్:
1. తండి రాజకీయ నేపథ్యం పెద్ద ప్లస్ పాయింట్.
2. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటంతో, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు పూర్తి సానుకూలత ఉంది.
3. కడియం శ్రీహరి వెంట బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ బాట పట్టడం ప్లస్ అవుతోంది.