Nagarkurnool : నాగర్ కర్నూల్.. కృష్ణా నది(Krishna River) కి తలాపున వున్న నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వుడు సీటు. ఎస్సీ, ఎస్టీలతోపాటు వెనుకబడిన వర్గాల సమాహారం ఈ లోక్‌సభ సీటు. అక్షరాస్యత తక్కువ వున్న ఈ ప్రాంతంలో ప్రతీసారి వైవిధ్యమైన ఫలితం వస్తూ వుంటుంది. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వారధిగా ఈ ప్రాంతం కనిపిస్తోంది.
2019లో బీఆర్ఎస్(BRS) అభ్యర్ధి పోతుగంటి రాములు గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధి మల్లు రవి రెండో స్థానంలో నిలిచారు.
ప్రస్తుతం కాంగ్రెస్(Congress) నుంచి మల్లు రవి, బీజేపీ(BJP) నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ నుంచి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. వీరిలో మల్లు రవి మాల సామాజికవర్గం, మిగిలిన అభ్యర్ధులు పోతుగంటి భరత్, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాదిగ సామాజికవర్గం నేతలు.
కాంగ్రెస్
మల్లు రవి - రాజకీయ కుటుంబ వారసత్వం ఉంది. రెండు సార్లు ఎంపీగా చేశారు.
బీజేపీ
పోతుగంటి భరత్ - తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తండ్రి రాములు 3 సార్లు ఎంపీ.
బీఆర్ఎస్
ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ - రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు.
కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం
Also Read : BRS MLC Kavitha: మళ్ళీ వాయిదా..
రీజన్స్:
1) మల్లు రవికి స్థానికంగా బాగా పట్టుంది. రెండుసార్లు మల్లు రవి, రెండుసార్లు ఆయన పెద్దన్న అనంతరాములు ఇక్కడ్నించి ఎంపీగా గెలిచారు.
2) బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆఖరు నిమిషంలో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన చాన్నాళ్లపాటు సిర్పూర్ అసెంబ్లీ మీద ఫోకస్ చేశాడు. ఇక్కడ పెద్దగా ప్రాతినిధ్యం లేదు.
3) పి. రాములు తన కుమారునికి బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వననడంతో బీజేపీలో చేరి పోటీ చేస్తున్నారు. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు.
4) బీజేపీకి ఒక్క కల్వకుర్తిలో మాత్రమే ట్రెడిషనల్ ఓటుబ్యాంకు వుంది.
5) బీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ప్రభావం చూపితే మల్లు రవి గెలుపు కొంత కష్టం. లేకపోతే నల్లేరు మీద నడకే.