Telangana Game Changer : మెదక్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!

ఈ లోక్ సభ ఎన్నికల్లో మెదక్‌లో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Telangana Game Changer : మెదక్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!

Lok Sabha Elections 2024 : జహీరాబాద్‌ తర్వాత మనకు కనిపిస్తోంది మెదక్‌(Medak) లోక్‌సభ(Lok Sabha) సీటు. 1980లో ఇందిరాగాంధీ(Indira Gandhi) కి అండగా నిలబడిన నియోజకవర్గం. కాకపోతే ఆనాటి లోక్‌సభ సీటు రూపురేఖలు చాలా మటుకు మారిపోయాయి. చర్చ్‌ ఆఫ్‌ సౌతిండియా కేంద్ర స్థానంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మెదక్‌ నియోజవర్గంలో పరిధిలోనే మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి.

2019లో బీఆర్ఎస్(BRS) అభ్యర్ధి కొత్తా ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి గాలి అనిల్ కుమార్ రెండో స్థానంలో నిలిచారు.

ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.

publive-image

కాంగ్రెస్
నీలం మధు - పటాన్‌చెరు అసెంబ్లీ టికెట్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. పార్టీ మారి మళ్లీ తిరిగొచ్చి ఎంపీ టికెట్ పొందారు.

బీజేపీ
రఘునందన్‌రావు - తెలంగాణ ఉద్యమకారుడు. ఒకసారి ఎమ్మెల్యే. దుబ్బాక ఉపఎన్నికతో రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.

బీఆర్ఎస్
వెంకట్రామిరెడ్డి - కలెక్టర్‌గా పనిచేశారు. మల్లన్నసాగర్ భూసేకరణ సమయంలో చురుగ్గా పనిచేశారు. బీఆర్ఎస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు.

గెలిచే అవకాశం: బీజేపీ

publive-image

Also Read : Telangana Game Changer: తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఫలితాలు ఇలా.. రవిప్రకాశ్ చెప్పిన సంచలన లెక్కలివే!

రీజన్స్‌:
1) మోదీ(PM Modi) కరిష్మాతో పాటు, నియోజకవర్గంలోని అన్ని సెగ్మెంట్లలో రఘునందన్‌ వ్యక్తిగత ఇమేజ్ పనిచేస్తుంది.
2) కాంగ్రెస్ అభ్యర్ధికి కేవలం సంగారెడ్డి, పటాన్‌ చెరు సెగ్మెంట్లలోనే అనుకూల పరిస్థితి ఉంది.
3) బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డికి మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల నుంచి వ్యతిరేకత ఉంది. దీని ప్రభావం 3 సెగ్మెంట్లలో గణనీయంగా కనిపిస్తోంది.
4) సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశం. నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు ఎటు మళ్ళితే అటు మెజారిటీ. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం నీలం మధుకు ప్లస్‌ కావచ్చు. ఓవరాల్‌గా బీజేపీ ఊపే కనిపిస్తోంది.

publive-image

Advertisment
తాజా కథనాలు