Lok Sabha Elections 2024 : ఇక హైదరాబాద్(Hyderabad).. ఈ లోక్‌సభ సీటు ప్రస్తావన రాగానే చర్చలెందుకు అది కచ్చితంగా ఓ సామాజిక వర్గానిదే అంటూ వుంటాం.. కానీ ఈసారి డిఫరెంట్ పరిస్థితి కనిపిస్తోంది. హిస్టారికల్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ చుట్టూ విస్తరించి వున్న ఈ లోక్‌సభ సీటు(Lok Sabha Seat) ఇపుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
2019లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధి భగవంత్‌రావు రెండో స్థానానికి పరిమితం అయ్యారు.
ప్రస్తుతం ఎంఐఎం(MIM) నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ వరుసా 5వ సారి బరిలో ఉన్నారు. బీజేపీ(BJP) నుంచి కొంపెల్ల మాధవీలత, బీఆర్ఎస్(BRS) నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి వలీవుల్లా సమీర్ పోటీ చేస్తున్నారు.
Also Read : పెద్దపల్లిలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
ఎంఐఎం
అసదుద్దీన్ ఒవైసీ - నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. ఎంఐఎం అధినేత.
బీజేపీ
కొంపెల్ల మాధవీలత - తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సామాజిక సేవాకార్యక్రమాలతో గుర్తింపు పొందారు.
బీఆర్ఎస్
గడ్డం శ్రీనివాస్ యాదవ్ - బీసీ, యాదవ సామాజికవర్గం నేత.
కాంగ్రెస్
మహ్మద్ వలీవుల్లా సమీర్ - ముస్లిం మైనారిటీ నేత.
ఎంఐఎం గెలిచే అవకాశం
రీజన్స్:
1) మత ప్రభావం ఓవైసీ విజయానికి బాట. 17 లక్షల ఓటర్లలో 11 లక్షల ఓట్లు ముస్లింలవే.
2) ఆఖరు 3, 4 రోజుల్లో రాత్రిళ్ళు ఎంఐఎం నడిపే రాజకీయ మంత్రాంగం ఓవైసీ విజయానికి బాట వేస్తుంది.
3) మాధవీలత గట్టిపోటీ ఇస్తున్నారు.. కానీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వీక్ క్యాండిడేట్లను దింపడం ఓవైసీకి సానుకులంగా మారింది.
4) బలమైన హిందూ నేత రాజాసింగ్.. మాధవీలతకు ఏ మాత్రం సహకరించకపోవడం ఆమెకు పెద్ద మైనస్ పాయింట్.