Lokesh Yuvagalam: రేపటి నుంచి మళ్లీ లోకేశ్ యువగళం పాదయాత్ర... అరెస్ట్ చేస్తే రంగంలోకి బ్రాహ్మణి?

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8.25గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఈ తరుణంలో పాదయాత్ర మరోవారం రోజుల పాటు వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరినట్లు సమాచారం. వచ్చేనెల 3వ తేదీ నుంచి యువగళం పాదయాత్ర చేట్టాలని కోరారని తెలుస్తోంది. ఒకవేళ లోకేశ్ ను అరెస్టు చేస్తే...బ్రాహ్మణి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పాదయాత్ర గురించి బ్రాహ్మణికి కుటుంబ సభ్యులు అన్ని విషయాలను వివరించారట.

Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు
New Update

Lokesh Yuvagalam from Tomorrow: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీ(TDP)లో ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8.25గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఈ తరుణంలో పాదయాత్ర మరోవారం రోజుల పాటు వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరినట్లు సమాచారం. వచ్చేనెల 3వ తేదీ నుంచి యువగళం పాదయాత్ర చేట్టాలని కోరారని తెలుస్తోంది. ఒకవేళ లోకేశ్ ను అరెస్టు చేస్తే...బ్రాహ్మణి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పాదయాత్ర గురించి బ్రాహ్మణికి (Nara Brahmani) కుటుంబ సభ్యులు అన్ని విషయాలను వివరించారట.

ఇది కూడా చదవండి: గుండెపోటుతో క్లాస్‎రూమ్‎లోనే 8వ తరగతి విద్యార్థిని మృతి..!!

కాగా శుక్రవారం నంద్యాలలో పార్టీ పీఎసీ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కమిటీ సమావేశంలో ఢిల్లీ నుంచి సామాజిక మాధ్యమం ద్వారా లోకేశ్ పాల్గొంటారని సమాచారం. చంద్రబాబును అరెస్టు చేసిన ప్రాంతంలోనే సమావేశం నిర్వహించాలని నిర్ణయించారట. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై రేపటి సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఈలోగా లోకేశ్ అరెస్టు చేసినట్లయితే...నారా బ్రాహ్మణి పాదయాత్ర చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే కుటుంబ సభ్యులు బ్రాహ్మణికి అన్ని విషయాల గురించి వివరించారట. బ్రాహ్మాణి నారా, నందమూరి కుటుంబాలకు చెందినది కావడంతో...ఆమె పాదయాత్ర చేపడితే ప్రజల నుంచి సానుభూతి ఎక్కువగా వస్తుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. అయితే లోకేశ్ యువగళం పాదయాత్ర రేపటి నుంచి కాకుండా మరో వారం రోజులపాటు వాయిదా వేయాలని టీడీపీలోని ఓ వర్గం నేతలు చెప్పారట.

అక్టోబర్ 3వ తేదీ వరకు ఎదురు చూసి ఆ తర్వాత పాదయాత్ర చేపట్టాలని సూచించారని సమాచారం. అయితే బ్రాహ్మణి పాదయాత్రపై అధికారపార్టీలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు(Chandrababu Arrest)తో టీడీపీకి సానుభూతి పెరుగుతుందని అధికార పార్టీలో ఆందోళన మొదలైందట. ఒకవేళ లోకేశ్ ను అరెస్టు చేస్తే...వారు అనుకున్నట్లు బ్రాహ్మాణి పాదయాత్ర చేపడితే...ప్రజల నుంచి మరింత సానుభూతి పెరిగే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఈ పాదయాత్రపై రేపు క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం మానుకోండి…లేదంటే ఈ వ్యాధులు తప్పవు..!!

#nara-lokesh #tdp #chandrababu #nara-brahmani #lokesh-yuvagalam #yuvagalam-padayatra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe