Kharge: ఇండియా కూటమి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించుకుంది. బుధవారం మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశం అయిన విషయం తెలిసందే. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలు.. భవిష్యత్ కార్యాచరణపై వారంతా కూడా చర్చలు జరిపారు. దీంతో ప్రతిపక్షంలో కొనసాగాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా ఇండియా భాగస్వామ్య పార్టీలన్నీ ఏకతాటిపై పోరాటం చేస్తాయని ఖర్గే ప్రకటించారు.
మోడీ నైతికంగా పరాజయం పాలయ్యారని ఖర్గే అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉందని ఖర్గే తెలిపారు. ఆయన నైతికంగా ఓడిపోయారన్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా, రాజకీయంగానూ నష్టపోయారని విమర్శించారు. ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను కూడా ఖర్గే ఆహ్వానం పలికారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతోపాటు.. శరద్ పవార్ (ఎన్సీపీ-ఎస్‌పీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), సంజయ్ సింగ్ (ఆప్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అభిషేక్ బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), చంపయ్ సోరెన్ (జేఎంఎం), రాఘవ్ చద్దా (ఆప్), డి.రాజా (సీపీఐ), సుప్రియా సూలే, కల్పనా సోరెన్ , సీతారాం ఏచూరి (సీపీఎం), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), సంజయ్ రౌట్ (శివసేన-ఉద్ధవ్‌ఠాక్రేవర్గం), సహా పలు పార్టీలకు చెందిన నేతలు ఈ
సమావేశంలో పాల్గొన్నారు.