Minister Komatireddy Venkat Reddy: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తప్పడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు తన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో (Congress Party) రేపు చేరనున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతల రాజీనామాలతో షాక్ లో కేసీఆర్ కు తాజాగా కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో బాంబు పేల్చారు.
30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
అధికారం పోయేసరికి కేసీఆర్ (KCR) కుంటుంబం తట్టుకోలేకపోతుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA's) టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిమా శ్రీనివాస్‌రావుకు కేసీఆర్ రూ.20వేల కోట్లు ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి బయటకు తీయాలంటే మాకు 20 ఏళ్లు పట్టేటట్లు ఉందని పేర్కొన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీకి మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. తాను కానీ, తన సోదరుడు కానీ అధిష్టానాన్ని ఎంపీ టికెట్ అడగలేదని అన్నారు.
దానం నాగేందర్ పోటీపై..
ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి ఎంపీగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీపై మేజ్`మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానం ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ కష్టమే అని అన్నారు. ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ అంటే లీగల్ సమస్యలు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read: బీఆర్ఎస్ ఓటమికి అదే కారణం.. నన్ను ఎవరూ ఆపలేరు - కేకే