Harish Rao Comments on CM Revanth Reddy: మీడియాతో జరిగిన చిట్ చాట్ లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లునే కాంగ్రెస్ పార్టీపై (Congress) వ్యతిరేకత వచ్చిందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు.. మంత్రి కీలక ప్రకటన
మోడీ ఆశీర్వాదం..
సీఎం రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) నిప్పులు చెరిగారు హరీష్ రావు. మోడీ (PM Modi) ఆశీర్వాదం కోసం రేవంత్ తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవదని రేవంత్ చెప్పకనే చెప్పారని అన్నారు. మోడీ మళ్లీ ప్రధాని అవుతారని రేవంత్ వ్యాఖ్యలు చెప్తున్నాయని పేర్కొన్నారు. రేవంత్ ప్రజలనే కాదు..రాహుల్‌గాంధీని (Rahul Gandhi) మోసం చేశారని అన్నారు. గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటే గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ అంటున్నారను చురకలు అంటించారు.
కాంగ్రెస్ వచ్చింది..కరువు వచ్చింది...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు కరువు వచ్చిందని ఎద్దేవా చేశారు హరీష్ రావు. ఆరు గ్యారెంటీలపై (Congress Guarantees) నోటరీలిచ్చి ప్రచారం చేసిన కాంగ్రెస్‌పై కేసులు పెట్టాలని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయాలో లేదో రైతులు నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. నిధులు దుర్వినియోగం అని చెప్పి ఆరుగురు పీఆర్వోలను ఎందుకు పెట్టుకున్నారని నిలదీశారు.
ఎందుకు ఓటు వెయ్యాలి..?
వంద రోజుల పాలనలో ఏం ఒరిగిందని లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. బాండ్ పేపర్లు రాసి ఇచ్చిన వారిపై కేసు పెట్టాలని అన్నారు. LRS ఉచితంగా చేస్తామన్నారు..ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అప్పుల గురించి ఆనాడూ మాట్లాడి..ఇప్పుడు రూ.16 వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. ఆటో వాళ్లకు ఏడాదికి రూ.12 వేలు అన్నారు.. ఏమైంది? అని నిలదీశారు. వృద్ధులకు ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టారని మండిపడ్డారు.
ALSO READ: రాజ్యాంగం ప్రమాదంలో ఉంది.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు