MLA Harish Rao: పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్
రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నేతలు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమి కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తమ పార్టీ నేతలను కాంగ్రెస్ లాక్కుందని అని విమర్శించారు.
MLA Harish Rao: లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కేశవరావు రాజీనామా చేయడంపై మాజీ మంత్రి హరీష్ విమర్శలు గుప్పించారు.
రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారని అన్నారు. నేతలు పార్టీ వీడి వెళ్లడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమీ కాదని అన్నారు. ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 10 మంది కూడా పార్టీలో లేరని గుర్తు చేశారు. అయినా తెలంగాణ తెచ్చి చూపెట్టారు కేసీఆర్ అని కొనియాడారు. ఆనాడు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని ఆరోపించారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను కొనలేరని వ్యాఖ్యానించారు. మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్లు పార్టీ నుంచి వెళ్తున్నారు అని అన్నారు. పార్టీ వీడిన వారిని మళ్లీ తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందని స్పష్టం.

Also Read: కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు