Eatala Rajender: కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత ఈటల రాజేందర్. కాంగ్రెస్‌తో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదని హెచ్చరించారు. 60 మంది ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం నాయకులను కొనుగోలు చేస్తోందని విమర్శించారు. మల్కాజ్‌గిరిలో ప్రధాని రోడ్ షో తర్వాత బీజేపీకి మద్దతు పెరిగిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈటల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతుందా? అనే అనుమానం తెలంగాణ ప్రజల్లో నెలకొంది.
30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: మంత్రి కోమటిరెడ్డి
అధికారం పోయేసరికి కేసీఆర్ (KCR) కుంటుంబం తట్టుకోలేకపోతుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA’s) టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిమా శ్రీనివాస్‌రావుకు కేసీఆర్ రూ.20వేల కోట్లు ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి బయటకు తీయాలంటే మాకు 20 ఏళ్లు పట్టేటట్లు ఉందని పేర్కొన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ – బీజేపీకి మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. తాను కానీ, తన సోదరుడు కానీ అధిష్టానాన్ని ఎంపీ టికెట్ అడగలేదని అన్నారు.
దానం నాగేందర్ పోటీపై..
ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి ఎంపీగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీపై మేజ్`మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానం ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ కష్టమే అని అన్నారు. ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ అంటే లీగల్ సమస్యలు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.