CM Revanth Reddy: ఏం చేసిండు.. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ సెటైర్లు

మోడీ 10 ఏళ్లు ప్రధాని ఉండి తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్. బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కు తీసుకెళ్లిన మోడీ.. వికారాబాద్‌కు రైలు తీసుకురాలేదని చురకలు అంటించారు. బీజేపీ నేతల వ్యవహారం పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుందని ఎద్దేవా చేశారు.

CM Revanth Reddy: ఏం చేసిండు.. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ సెటైర్లు
New Update

CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా చేవెళ్ల పార్లమెంట్ నేతలతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నామని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని వివరించారు.

మనపాలన రెఫరెండం..

చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందని అన్నారు రేవంత్. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ ని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు మన వంద రోజుల పరిపాలనకు రెఫరెండం అని అన్నారు. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదాం అని పిలుపునిచ్చారు.

మోడీ ఎం చేశారు?..

పదేళ్లు ప్రధానిగా ఉన్న మోడీ ఏం చేశారు? అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయలేదని.. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదన అన్నారు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కు తీసుకెళ్లిన మోడీ.. వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదని చురకలు అంటించారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసుకున్న మోడీ... మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోంది?, ఏం చూసి మూడోసారి మోడీకి ఓటు వేయాలని బీజేపీ అడుగుతున్నారు? అని ప్రశ్నించారు.

పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుంది..

బీజేపీ నేతల వ్యవహారం పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుందని ఎద్దేవా చేశారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది చక్కని అవకాశం.. పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారని గుర్తు చేశారు. పార్టీకి అండగా నిలబడి సోనియమ్మ నాయకత్వానికి బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

తుక్కుగూడలో సభ..

తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నాం అని గుర్తు చేశారు. మళ్లీ అక్కడే ఏప్రిల్ 6 లేదా 7 న జాతీయ స్థాయి గ్యారేంటీలను ప్రకటించుకోబోతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నాం.. ఈ జనజాతర సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు.

#cm-revanth-reddy #pm-modi #cogress #2024-lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe