Lok Sabha Elections 2024: కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ.. బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు?

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు పెట్టుకోబోతుందనే ప్రచారం జోరందుకుంది.

RS Praveen Kumar: కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేసేది అక్కడి నుంచే?
New Update

RS Praveen Met KCR: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు (BRS - BSP Alliance) పెట్టుకోబోతుందనే ప్రచారం జోరందుకుంది. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఈ క్రమంలో సీట్ల సద్దుబాటు కొరకే కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) భేటీ అయ్యారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది.

ALSO READ: తొలి జాబితా ప్రకటన.. తెలంగాణలో బీజేపీకి షాక్ తప్పదా?

నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా..

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీలోకి దిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటమి చెందారు. ఏకంగా మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని భావించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాష్ట్రంలో అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ పార్టీతో (BRS Party) పొత్తు పెట్టుకుంటే కనీసం పార్లమెంట్ ఇద్దరు ఎంపీలనైనా పంపవచ్చు అని భావిస్తున్నారట. ఈ క్రమంలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ గా పోటీ చేయాలనీ ప్రవీణ్ కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి ఓకే అనుకుంటే రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తుకు రెడీ కానున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ కు బహుజనుల అండ..

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంతో పాటు నేతలను కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లను లోక్ సభ ఎన్నికల్లో చేయకుండా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. సిట్టింగ్ లకు కాకూండా కొత్త ముఖాలకే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ (KCR) నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీని గెలిపించే సత్తా ఉన్న కొత్త లీడర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ వెతుకుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమకు బహుజనుల ఓట్లు పడుతాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఒకటి లేదా రెండు ఎంపీ స్థానాలను బీఎస్పీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ పన్నిన కొత్త వ్యూహం బీఆర్ఎస్ లీడర్లను పార్లమెంట్ లో కుర్చోపెడుతుందా?, దీనికి బీఎస్పీ ఏమంటుంది?, బీఆర్ఎస్ తో పొత్తుకు రెడీగా ఉందా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

#rs-praveen #rs-praveen-met-kcr #kcr #lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి