Tellam Venkat Rao : బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే

భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గత కొంత కాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

New Update
Tellam Venkat Rao : బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే

Tellam Venkat Rao : తెలంగాణ(Telangana) లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) లోకి వలసలు ఆగడం లేదు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా ఈ జాబితాలో బీఆర్ఎస్ నుంచి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం గత కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkat Rao) తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసం లో కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం మరోసారి జోరందుకుంది.

ALSO READ: బీజేపీ తొలి జాబితా.. డీకే అరుణకు బిగ్‌ షాక్‌

ఖమ్మంలో బీఆర్ఎస్ కనుమరుగు?

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా(Khammam District) లో మొత్తం 10 స్థానాలు ఉంటే ఒకటే స్థానానికి పరిమితం అయింది. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో ఉన్న ఆయన తనకు టికెట్ రాకపోవడం బీఆర్ఎస్ పార్టీ లో చేరి ఎన్నికల్లో గెలిచారు. తాజాగా ఆయన కాంగ్రెస్ లో చేరుతారని వార్తలు రావడంతో.. ఒకవేళ ఆయన కాంగ్రెస్ లో చేరితే ఉన్న ఒక్క సీటు కోల్పోయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కనుమరుగు అవ్వడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఆయన కాంగ్రెస్ లో చేరుతారా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

అభివృద్ధి కొరకే..

ఇదిలా ఉండగా.. భద్రాచలం(Bhadrachalam) ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. నియోజక అభివృద్ధి విషయాలు మాట్లాడేందుకు ఆయన సీఎం రేవంత్ ను కలిశారని.. రాజకీయాలు మాట్లాడేందుకు కలవలేదని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది బీఆర్ఎస్. మరోవైపు సీఎం రేవంత్ తో భేటీ తెల్లం వెంకట్రావు స్పందించకపోవడంతో అనేక అనుమానాలకు దారి తీస్తోంది.

Advertisment
తాజా కథనాలు