Bangaru Shruthi: కాంగ్రెస్‌లోకి మరో బీజేపీ నేత?

సీఎం రేవంత్‌తో బీజేపీ నాయకురాలు, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ బంగారు శృతి భేటి అయ్యారు. మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎన్నికలు జరగనున్న వేళ రేవంత్‌‌తో బంగారు శృతి భేటి కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. త్వరలో ఆమె కాంగ్రెస్‌లో చేరునునట్లు ప్రచారం జోరందుకుంది.

New Update
Bangaru Shruthi: కాంగ్రెస్‌లోకి మరో బీజేపీ నేత?

Bangaru Shruthi: తెలంగాణలో ఇతర పార్టీ నేతల చేరికలతో లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోంది. తాజాగా మరో నేత కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌తో బీజేపీ నాయకురాలు, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ బంగారు శృతి భేటి అయ్యారు. మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎన్నికలు జరగనున్న వేళ రేవంత్‌-బంగారు శృతి భేటి రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ALSO READ: తొలి జాబితా ప్రకటన.. తెలంగాణలో బీజేపీకి షాక్ తప్పదా?

అందుకే కలిశాను: బంగారు శృతి

సీఎం రేవంత్ ను భేటీ అవ్వడంపై క్లారిటీ ఇచ్చారు బంగారు శృతి. మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశానని.. రాజకీయాల కోసం కాదని అన్నారు. దివంగత బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ కుమార్తె శృతి. నాగర్‌కర్నూల్‌ టికెట్‌ తనకు వస్తుందని ఆశించి భంగపడ్డారు బంగారు శృతి. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సిట్టింగ్‌ ఎంపీ రాములు కుమారుడు భరత్‌కు ఎంపీ టికెట్ ఇవ్వడంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. 2019లో నాగర్‌కర్నూల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు బంగారు శృతి. నాలుగేళ్లుగా బీజేపీ ఆర్గనైజింగ్‌ వ్యవహారాలు చూస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆమె సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం.. పార్టీ మారుతారనే ప్రచారనికి లేవనెత్తింది.

భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: మురళీధర్ రావు

బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా తెలంగాణలో దుమారం రేపుతోంది. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారిని కాదని.. నిన్న, మొన్న చేరిన బీఆర్ఎస్ నేతలకు టికెట్‌లు ఇవ్వడాన్ని కాషాయ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.తాజాగా.. మల్కాజ్‌గిరి టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.‘మల్కాజ్‌గిరిలో నా కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే నా అనుచరులను, కార్యకర్తలను వ్యక్తగతంగా కలుస్తా అని అన్నారు. ఆపై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా’ అని ట్విట్టర్ లో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టు బీజేపీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. కాగా, తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందుకే వివాదాస్పదం లేకుండా ఉంటే తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. కీలక మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలు ప్రకటించాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు