Kishan Reddy: ఈ నెల 12న హైదరాబాద్‌కు అమిత్ షా

అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 12న ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఎల్బి స్టేడియంలో పోలింగ్ బూత్ ఇంఛార్జిలతో సమావేశం కానున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Kishan Reddy: ఈ నెల 12న హైదరాబాద్‌కు అమిత్ షా
New Update

Telangana BJP Chief Kishan Reddy: లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) బరిలో నిలిచే అభ్యర్థులపై కసరత్తు జరుగుతోందని అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). ఈ క్రమంలో ఈ నెల 12 వ తేదీన హైదరాబాద్ కు అమిత్ షా (Amit Shah) వస్తున్నట్లు తెలిపారు. అమిత్ షా తో తెలంగాణ వ్యాప్తంగా పోలిగ్ బూతుల అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్యకర్తలు పోలింగ్ బూత్ ల అధ్యక్షుల ను టార్గెట్ చేసుకుని మీటింగ్స్ పెట్టాలని ప్రధాని ఆదేశించారని అన్నారు. పర్యటనలో భాగంగా ఇంపీరియల్ గార్డెన్ లో జరిగే సోషల్ మీడియా ఇంచార్జీలతో సమావేశం ఉంటుందని తెలిపారు. ఎల్బి స్టేడియం లో పోలింగ్ బూత్ ఇంఛార్జి లు ఆ పై స్థాయి నాయకుల మీటింగ్ లో పాల్గొంటారని అన్నారు. అనంతరం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అమిత్ షా రానున్నట్లు తెలిపారు. తెలంగాణ పర్యటనలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని అమిత్ షా దర్శించుకోనున్నారు.

ALSO READ: రేపు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్

రేపు రెండో జాబితా..?

తొలి జాబితాలో తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మిగిలిన 8 స్థానాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. రెండవ జాబితాలో ఐదుగురిని బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా నాలుగు స్థానాలను మార్చి చివరి వారంలో ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఈ నెల 11న రెండో జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు షాక్!

సెకండ్ లిస్టులో వీరి పేరు?..

* మెదక్ – రఘునందన్ రావు.

* మహబూబ్ నగర్ – డీకే అరుణ

* ఆదిలాబాద్ – సోయం బాపూరావు

* మహబూబాబాద్ – మాజీ ఎంపీ సీతారాం

* ఖమ్మం – జలగం వెంకట్రావు

#amit-shah-telangana-tour #kishan-reddy #lok-sabha-elections #amit-shah
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe