Kishan Reddy: ఈ నెల 12న హైదరాబాద్‌కు అమిత్ షా అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 12న ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఎల్బి స్టేడియంలో పోలింగ్ బూత్ ఇంఛార్జిలతో సమావేశం కానున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. By V.J Reddy 10 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana BJP Chief Kishan Reddy: లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) బరిలో నిలిచే అభ్యర్థులపై కసరత్తు జరుగుతోందని అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). ఈ క్రమంలో ఈ నెల 12 వ తేదీన హైదరాబాద్ కు అమిత్ షా (Amit Shah) వస్తున్నట్లు తెలిపారు. అమిత్ షా తో తెలంగాణ వ్యాప్తంగా పోలిగ్ బూతుల అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్యకర్తలు పోలింగ్ బూత్ ల అధ్యక్షుల ను టార్గెట్ చేసుకుని మీటింగ్స్ పెట్టాలని ప్రధాని ఆదేశించారని అన్నారు. పర్యటనలో భాగంగా ఇంపీరియల్ గార్డెన్ లో జరిగే సోషల్ మీడియా ఇంచార్జీలతో సమావేశం ఉంటుందని తెలిపారు. ఎల్బి స్టేడియం లో పోలింగ్ బూత్ ఇంఛార్జి లు ఆ పై స్థాయి నాయకుల మీటింగ్ లో పాల్గొంటారని అన్నారు. అనంతరం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అమిత్ షా రానున్నట్లు తెలిపారు. తెలంగాణ పర్యటనలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని అమిత్ షా దర్శించుకోనున్నారు. ALSO READ: రేపు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రేపు రెండో జాబితా..? తొలి జాబితాలో తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మిగిలిన 8 స్థానాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. రెండవ జాబితాలో ఐదుగురిని బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా నాలుగు స్థానాలను మార్చి చివరి వారంలో ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఈ నెల 11న రెండో జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ALSO READ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు షాక్! సెకండ్ లిస్టులో వీరి పేరు?.. * మెదక్ – రఘునందన్ రావు. * మహబూబ్ నగర్ – డీకే అరుణ * ఆదిలాబాద్ – సోయం బాపూరావు * మహబూబాబాద్ – మాజీ ఎంపీ సీతారాం * ఖమ్మం – జలగం వెంకట్రావు #lok-sabha-elections #kishan-reddy #amit-shah #amit-shah-telangana-tour మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి