TS Congress : నల్గొండ కాంగ్రెస్ టికెట్ రేసులో ఊహించని పేరు.. పటేల్ రమేష్ రెడ్డికి మళ్లీ షాక్?

సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పడు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

New Update
Patel Ramesh Reddy: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి పటేల్ రమేష్ రెడ్డి?

Nalgonda : ఉమ్మడి నల్గొండ(Nalgonda) ఎంపీ సీటు కోసం అధికార కాంగ్రెస్ పార్టీతో(Congress Party) పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలో(BRS Party) తీవ్ర పోటీ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లోని సూర్యాపేట మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. దీంతో ఈ ఎన్నికల్లో ఇక్కడ తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ నాయకత్వం ధీమాతో ఉంది. ఈ టికెట్ ను తన కుమారుడు రఘువీర్ కు ఇప్పించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి(Jana Reddy) విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే.. సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి(Patel Ramesh Reddy) కూడా అంతే సీరియస్ గా ట్రై చేస్తున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ను ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Jagga Reddy: హడావిడిగా ఢిల్లీకి జగ్గారెడ్డి.. కారణం ఇదేనా?

ఇందుకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కూడా నో అబ్జెక్షన్ లెటర్ కూడా రాసి ఇచ్చారు. దీంతో తాను కాదు అంటే తప్పా టికెట్ ను వేరే వారికి ఇచ్చే అవకాశమే లేదని పటేల్ రమేష్ రెడ్డి ధీమాగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే.. మిర్యాలగూడ టికెట్ ఆశించి భంగపడ్డ జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉండడం పటేల్ రమేష్ రెడ్డి వర్గాన్ని కాస్త ఆందోళనకు గురి చేస్తోందని సమాచారం.
ఇది కూడా చదవండి:

సీఎం రేవంత్ రెడ్డికి రఘువీర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయనకు టికెట్ పక్కా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ తో రఘవీర్ కు ఉన్నటువంటి సన్నిహితం తో టికెట్ పక్క అని ప్రచారం కొనసాగుతుంది.

అయితే సీఎం రేవంత్(CM Revanth) కి కూడా పటేల్ రమేష్ రెడ్డి సన్నిహితుడు కావడంతో ఇప్పుడు ఆయన ఎవరివైపు మొగ్గు చూపుతారన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రఘవీర్ కు ఎంపీగా అవకాశం ఇస్తారా? లేక పటేల్ రమేష్ రెడ్డినే పోటీకి దింపుతారా అనే సస్పెన్స్ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు