/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-21T170603.538.jpg)
AP LIQUOR SCAM: ఆంధ్రప్రదేశ్‌లోనూ వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగినట్లు బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు లిక్కర్ స్కామ్‌పై విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె లేఖ రాశారు. ఈ మేరకు.. లిక్కర్ పేరుతో వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని, ఏపీలో నాణ్యమైన లిక్కర్ అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
I urge @ncbn Garu for a CBI investigation into this entire incident and to ensure the safe supply of quality liquor in AP through digital platforms pic.twitter.com/D0Byaz0KZT
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) June 21, 2024
అలాగే గురువారం రాత్రి చంద్రబాబును కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గడిచిన ఐదేళ్లలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. దీంతోపాటు విద్యుత్ సెక్టార్‌లో స్మార్ట్ మీటర్లు, PPAల్లో భారీ కుంభకోణాలు జరిగినట్లు బీజేపీ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు చెప్పారు. సాంఘీక సంక్షేమ శాఖలోనూ అవినీతి జరిగిందని, వైసీపీ అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేతలు వెల్లడించారు.