Chintamaneni Prabhakar: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన సీట్ల కన్ఫూజన్ ఒక కొలిక్కి వచ్చింది. టీడీపీ నుంచి పెండింగ్‌లో పెట్టిన మూడు స్థానాలపైన స్పష్టతనిచ్చారు పార్టీ అధినేత చంద్రబాబు. అనపర్తి సీటు మీద క్లారిటీ రావడంతో దెందులూరు సీటును చింతమనేని ప్రభాకర్‌కు కన్ఫామ్ చేశారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా ఆయనకు ఫోన్ చెప్పారు. బీ ఫామ్ తీసుకోవడానికి రమ్మని పిలిచారు. దీంతో శ్రీకాకుళంలో ఈ రోజు మధ్యాహ్నం చితమనేని బీఫామ్ తీసుకోనున్నారు.
అనపర్తి సీటుపై క్లారిటీ...
అనపర్తి సీటును టీడీపీకి ఇచ్చి తంబళ్లపల్లి, దెందులూరులో ఒక సీటు తీసుకోవాలని బీజేపీకి ప్రతిపాదనల చేశారు. దీంతో చంద్రబాబు ఈ మూడు నియోజకవర్గాల బీఫామ్‌లను పెండింగ్‌లో పెట్టారు. ఇదే సమయంలో నల్లిమిల్లి బీజేపీలో చేరుతూ ఉత్కంఠతకు తెర దించారు. ఆనపర్తి సీటుపై క్లారిటీ రావడంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయినట్టు అయింది. దాంతో పాటూ తంబాలపల్లిలో టీడీపీ అభ్యర్థులకు లైన్ క్లియర్ అయింది. ఇద్దరు నేతలు చింతమనేని, జయచంద్రారెడ్డిలకూ టీడీపీ అధినేత బీఫాయ్ తీసుకోవడానికి రావాలని ఫోన్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు శ్రీకాకుళంలో ఉండటంతో.. చింతమనేని, జయచంద్రారెడ్డిలు శ్రీకాకుళం బయలుదేరారు. అయితే చింతమనేని మెన్ననే దెందులూరులో భారీ ర్యాలీతో వెళ్ళి నామినేషన్‌ను దాఖలు చేశారు.
Also Read:Andhra Pradesh: ఈనెల 26న వైసీపీ మేనిఫెస్టో..నవరత్నాల అప్‌గ్రేడెడ్ వెర్షన్?