Differences in Denduluru YCP: దెందులూరు వైసీపీలో రగడ.. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై నేతల తిరుగుబాటు
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి చిక్కులు ఎదురువుతున్నాయి. 175కి 175 సీట్లు సాధిస్తామంటోన్న నేతలకు అసమ్మతి ఎదురవుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసమ్మతి పోరును ఎదుర్కొంటున్నారు. దీంతో వైసీపీ అధిష్టానానం తలలు పట్టుకుంటోంది. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో అసమ్మతి భగ్గుమంతి. ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొఠారు అబ్బయ్య చౌదరికి టికెట్ ఇస్తే వైసీపీ ఓటమి పాలవ్వడం ఖాయమని అంటున్నారు. రాబోయే ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థిని మారిస్తేనే పార్టీ విజయానికి కృషి చేస్తామని తెగేసి చెప్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో బయటపడ్డ వర్గపోరు ఇప్పుడు ఏలూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.