Life Time Free Bus Pass : ఇటీవల కరీంగర్ (Karimnagar) బస్‌స్టాండ్ లో ఓ మహిళ.. బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఊరెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చిన ఆ మహిళకు పురిటినొప్పులు రావడంతో.. అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది ఆమెకు పురుడు పోశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ (CM Revanth) కూడా ఆ మహిళా సిబ్బందిని అభినందించారు. అయితే బస్టాండ్‌లో పుట్టిన చిన్నారి కోసం తాజాగా టీజీఆర్టీసీ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ చిన్నారికి తమ ఆర్టీసీ బస్సుల్లో జీవితకాలం ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్‌స్టాండ్‌లలో పుట్టిన పిల్లలకు తమ జీవిత కాలంలో ఉచితంగా బస్‌పాస్ ఇవ్వాలని గతంలోనే ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ చిన్నారికి బర్త్ డే గిప్ట్ సందర్భంగా లైఫ్ టైం ఫ్రీ బస్‌ను మంజూరుచేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar).. ఈ విషయాన్ని ఎక్స్‌లో తెలిపారు.
Also Read: మియాపూర్ బాలిక మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. తండ్రి నరేష్ ప్రధాన సూత్రధారిగా గుర్తింపు..!
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 16న కూమారి అనే గర్భిణీ, తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్‌కు వచ్చారు. ఆమెకు అక్కడే నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ లోగా నొప్పులు ఎక్కువ కావడంతో.. ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమయస్పూర్తితో వ్యవహారించి.. సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్యలను బుధవారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు.
Also read: గన్‌తో బెదిరించి లేడి కానిస్టేబుల్‌ను రేప్ చేసిన ఎస్సై