తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు రావడంతో అన్ని ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. దీంతో మిగతా ఆలయాల్లో వినియోగించే నెయ్యి స్వచ్ఛమైనదా? కాదా? అని పరీక్షిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాల నెయ్యిని శాంపిల్స్ తీసుకుని టెస్ట్‌లకి పంపించారు. అయితే ఇటీవల యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వినియోగించే నెయ్యిని కూడా ల్యాబ్ టెస్ట్‌కి పంపించారు.
ఇది కూడా చూడండి: Hyderabad: దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అర్థరాత్రి ఆటోలో అత్యాచారం
నెయ్యి నాణ్యమైనదని..
శాంపిల్స్ తీసుకుని పరీక్షించగా.. నెయ్యి స్వచ్ఛమైనదని నిర్ధారించారు. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని విజయ డెయిరీ నుంచి రాష్ట్రంలో అన్ని దేవాయలయాలు నెయ్యిని వినియోగించాలా? వద్దా? అని ఆలయ అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిపై కల్తీ జరుగుతుందనే ఆరోపణలు రావడంతో తెలంగాణలోని పలు ప్రధాన ఆలయాలు నెయ్యి నమూనాలను పరీక్షల కోసం సమర్పించాలని ప్రభుత్వ ఆదేశించడంతో టెస్ట్‌లకు పంపించారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: గ్రూప్ -1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.
ఈ విజయ డెయిరీ నెయ్యిని శాంపిల్స్ పరీక్షించగా.. తేమ శాతం, ఒలేయిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు అన్ని పరిమితుల్లో ఉన్నాయని శాంపిల్స్ తెలిపాయి. కేవలం ఒక పరీక్ష మాత్రమే కాకుండా పలు టెస్ట్‌లు చేయగా.. నెయ్యి నాణ్యమైనదే అని తేలింది. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాల నిర్వహించింది. అయితే సాధారణంగా టెండర్ జారీ చేసి దాన్ని బట్టి నెయ్యిని సేకరిస్తారని ఆలయ అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: ఉదయం లేవగానే ఈ వస్తువులను చూశారంటే.. శని మీ చుట్టూ వైఫైలా తిరుగుతుంది!
ఇదిలా ఉండగా నల్గొండలోని ఓ ఆలయానికి మదర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేస్తోంది. టెస్ట్ ఫలితాలు పాజిటివ్‌గానే వచ్చిన విజయ డెయిరీని కొనసాగించాలా లేదా మదర్ డెయిరీకి మార్చాలా అని ఆలోచిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలుపుతున్నారు. యాదాద్రిలో రోజుకు 100 కిలోల పులిహోర ప్రసాదం, 6 కిలోల దద్దోజనం ప్రసాదాన్ని యాత్రికులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పులిహోర, దద్దోజనం, వడ, లడ్డూతో సహా అదనపు ప్రసాదాలను కూడా భక్తులకు విక్రయిస్తారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: టీచర్ల పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా!