Wood Sorrel Plant : కొట్లాటల సమయంలో మనుషులు ఒకరిపై ఒకరు దాడి చేయడం, ఏదైనా ఆయుధంతో ప్రతీకారం తీర్చుకోవడం చూస్తూ ఉంటాం. పోలీసులు, మావోయిస్టులు, ఉగ్రవాదులు అయితే ఎన్‌కౌంటర్లలో తూటాల వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే మనుషులే కాదు కొన్ని మొక్కలు కూడా శత్రువులపై దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే ఓ మొక్క ఎవరైనా టచ్ చేశారంటే చాలు వాళ్లపై ఏకదాటిగా దాడి చేస్తుంది. ఆ మొక్క ఏంటో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
చిన్నచిన్న గింజలతో దాడి:
ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మొక్కల్లోనూ వింత మొక్కలు ఉన్నాయి. అలాంటి ఓ మొక్కపేరు వుడ్ సోరెల్. దీని ప్రత్యేకత ఏంటంటే మొక్కే కదా అని టచ్ చేస్తే మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వుడ్ సోరెల్ ప్లాంట్ ఒక అద్భుతమైన మొక్క. ఎవరూ దీనిని ముట్టుకోవడం దానికి ఇష్టం ఉండదు. లజ్వంతి మొక్కలా ముట్టుకుంటే సిగ్గుతో కుంచించుకుపోకుండా ఎదురుదాడి చేసి పగ తీర్చుకుంటుంది. ముట్టుకోగానే చిన్నచిన్న గింజలతో దాడి చేయడం మొదలుపెడుతుంది.
ఈ వుడ్ సోరెల్ మొక్క బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మొక్క దాని గింజలను 4 మీటర్ల దూరం వరకు వేగంగా వెదజల్లగలదు. ఏదైనా జీవి దానిని ముట్టుకుంటే టార్గెట్ మిస్‌కాకుండా గింజలతో దాడి చేయడం దీని స్పెషాలిటీ. జాగ్రత్తగా ఉండకపోతే కొన్నిసార్లు మనకు గాయాలు కూడా అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
Also Read : బాలీవుడ్ నటుడు గోవిందాకు ప్రమాదం .. చేతిలో పేలిన గన్!