/rtv/media/media_files/2025/02/05/kk2jmnHXGyRMPjVuu2t0.jpg)
Black, White Pepper
Black Pepper: భారతీయ వంటకాల్లో మిరియాలకు ప్రత్యేక స్థానం ఉంది. కానీ నలుపు, తెలుపు మిరియాలు ఒకే మొక్క నుంచి వచ్చినా అవి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వంటలకు మంచి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మిరియాలు చాలా మంచిది. నల్ల మిరియాలు సాధారణంగా కారంగా ఉంటాయి. తెల్ల మిరియాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. ఇందులో కారం ఉండదు. క్రీమ్‌లు, సూప్‌లు లేదా వైట్ సాస్‌ల వంటి తేలికపాటి వంటకాలకు ఉపయోగిస్తారు. నల్ల మిరియాలపై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
బ్లాక్ పెప్పర్‌లో ఘాటు..
నల్ల మిరియాలపై తోలు ముడతలు పడి ఉంటుంది. వీటిని ఎక్కువగా ఎండబెడతారు. వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుంది. తెల్ల మిరియాలను నీటిలో నానబెట్టి వాటి బయటి తొక్కలను తీసేస్తారు. ఆ తర్వాత ఎండబెడతారు. ఇది మృదువైన ఆకృతితో పాటు వాసన కొంచెమే వస్తుంది. బ్లాక్ పెప్పర్‌లో ఘాటు కారణంగా వంట రుచి పెరుగుతుంది. గరం మసాలా తయారీలో ఉపయోగించే ప్రధాన సుగంధ ద్రవ్యాలలో ఇది కూడా ఒకటి.
ఇది కూడా చదవండి: 666 వాకింగ్ రూల్ గురించి మీకు తెలుసా..?
తెల్ల మిరియాలకు పెద్దగా రుచి ఉండదు. లైట్ కలరింగ్ కోసం ఉపయోగిస్తారు. అందుకే దీనిని సూప్‌లలో ఎక్కువగా వాడుతారు. బ్లాక్ పెప్పర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఫైబర్‌తో పాటు అదనపు పోషకాలను కలిగి ఉంటాయి. వైట్ పెప్పర్ నల్ల మిరియాల కంటే తక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బయటి పొర తొలగించడం వల్ల తక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వయస్సు ప్రకారం రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలి?