Smoking Habit: స్మోకింగ్ ఇప్పుడే మానేయ్.. లేదంటే..!

స్మోకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సం. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే ఈ అలవాటును మానలేకపోతున్నారు. రీసెంట్ గా ఒక అధ్యయనంలో ఈ అలవాటుకు చాలా మంది చెప్పే సమాధానం జీవితం లో అసంతృప్తి, కోపం, నిరాశ వంటి భావోద్వేగాలు గా తెలుస్తుంది.

New Update
Smoking Habit

Smoking Habit

Smoking Habit: స్మోకింగ్ అనేది ఆరోగ్యానికి ఎంతో హానికరమని తెలిసి కూడా ఎందుకో చాలామంది ఈ అలవాటును మానలేరు. స్మోకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అలవాటు కేవలం ఆ వ్యక్తి ఆరోగ్యం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వారి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే, స్మోకింగ్ చేసే వారు ఎందుకు ఈ అలవాటును మానలేకపోతున్నారంటే, చాలా మంది ఇచ్చే సమాధానాలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.

Also Read: అల్లుడితో అత్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ.. చివరికి ముగ్గురు కలిసి!

స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశాలు పాడవుతాయి, జలుబు, న్యుమోనియా వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంది. దీర్ఘకాలంలో ఈ అలవాటు క్యాన్సర్ గా కూడా మారొచ్చు. అయినప్పటికీ, కొంతమంది ఈ అలవాటును మానడానికి సిద్ధపడరు.

Also Read:అమెరికా డిపోర్టేషన్‌.. మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదన్న కేంద్రం

వారిని అడిగితే, జీవితం లో అసంతృప్తి, కోపం, నిరాశ వంటి భావోద్వేగాలు ఎక్కువగా ధూమపానానికి కారణమవుతున్నాయి అని అంటుంటారు. యువత, ముఖ్యంగా 15-24 సంవత్సరాల వయస్సు లో ఉన్నవారే స్మోకింగ్ అలవాటు చేసుకుంటున్నారు. స్నేహితుల ప్రోత్సాహం, సోషల్ స్టేటస్ పెంచుకోవాలనే కోరిక, లేదా ఒత్తిడి, భయాలు ధూమపానానికి దారితీస్తున్నాయి.

Also Read:Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

స్మోకింగ్‌ను ఒక స్టైల్ గా చూపిస్తూ..

అంతేకాక, తల్లిదండ్రుల బట్టి కూడా పిల్లలకు ఈ అలవాటు వచ్చే ప్రమాదం ఉంది. పేరెంట్స్ స్మోకింగ్ చేస్తే, పిల్లలు కూడా అదే అలవాటును అనుసరించే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో, టీవీ సిరీస్‌లు, సినిమాలు, ప్రకటనలు స్మోకింగ్‌ను ఒక స్టైల్గా చూపిస్తున్నాయి, దీంతో ఇది చాలా ప్రభావితంగా మారిపోయింది.

ఇలా అనేక కారణాలతో యువత స్మోకింగ్ కి అలవాటు పడుతున్నారు. అయితే స్మోకింగ్ కి బానిసలుగా మారొద్దని వైద్య నిపుణులు చాలా బలంగా సూచిస్తున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

Advertisment
తాజా కథనాలు