Walnut: ప్రస్తుత జీవనశైలిలో వ్యాయామం చేయడం వల్ల అనారోగ్యాన్ని నివారించి శరీరాన్ని ఫిట్‌గా ఉంటుంది. శరీరంతోపాటు మెదడు ఆరోగ్యంగా ఉండాలి. శరీరం పనితీరుకు, మెదడు పనితీరు చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మెదడు మొత్తం శరీరాన్ని పని చేసేలా చేస్తుంది. మెదడు శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఆలోచించే , అర్థం చేసుకునే, నిర్ణయాలు తీసుకునే శక్తిని మెదడు ఇస్తుంది. అంతేకాదు మెదడు గుండె స్పందన రేటు , జీర్ణక్రియ , చేతులు, కాళ్ళ కదలిక వంటి శరీరంలోని ఇతర భాగాలను నియంత్రిస్తుంది . అయితే కొన్ని ఆహారాలు రోజూ వారి డైట్‌లో చేర్చుకుంటే మెదడుకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహరాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
బాదం- వాల్‌నట్:
- విటమిన్ ఇ , ఒమేగా 3 ఫ్యాటీ, కొవ్వు ఆమ్లాలు యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు బాదంపప్పు, వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడి మెదడుకు మేలు చేస్తాయి.
ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టుల రివేంజ్.. ఇన్ఫార్మర్లను గొడ్డలితో నరికి చంపి..!
తాజా పండ్లు-కూరగాయలు:
- బ్లూబెర్రీస్ , స్ట్రాబెర్రీలు, బ్రోకలీ వంటి కూరగాయలు , క్యారెట్‌లలో మెదడు కణాలను రక్షించే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆలోచనా శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ కూరగాయలలో ఉండే పీచుపదార్థాలు మెదడుకు మేలు చేస్తాయి.
ఇది కూడా చదవండి: అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్ స్వీట్ రియాక్షన్!
పాలు-పాల ఉత్పత్తులు:
- మెదడు కణాల పెరుగుదలకు, పనితీరుకు అవసరమైన కాల్షియం , ప్రోటీన్ , విటమిన్ బి12, విటమిన్ డి వంటి పోషకాలను పాలలో ఉన్నాయి. ఇది మెదడుకు శక్తిని అందించే, న్యూరాన్ల కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచే అవసరమైన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది.
గుడ్డు:
- గుడ్లు మెదడుకు శక్తినిచ్చే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. అంతేకాకుండా గుడ్లు కోలిన్ అనే పోషకాన్ని ఉంటుంది. ఇది మెదడు కణాల పెరుగుదల, పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది న్యూరోట్రాన్స్‌మిటర్‌గా పనిచేస్తుంది. గుడ్లలో ఐరన్ , జింక్ , సెలీనియం, అయోడిన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. గుడ్లు తినడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పని చేయండి
ఇది కూడా చదవండి: Heart Healthy: చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పని చేయండి