/rtv/media/media_files/2025/04/21/7KlZxFrtlN7r0XKxaT05.jpg)
Vastu Tips PHOTOS
Vastu Tips: హిందువులు ఇంట్లో చిత్ర పటాలను పెట్టి పూజలు(Puja) నిర్వహిస్తారు. ఇంట్లో ఓ చిన్న మందిరం పెట్టుకుని, భక్తితో వాటికి పూజలు చేస్తారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని రకాల చిత్ర పటాలను ఇంట్లో ఉంచకూడదట. కొందరు తెలియక ఇంట్లో వాటిని ఉంచడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. అయితే ఇంట్లో పెట్టకూడని ఆ చిత్ర పటాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
నటరాజ విగ్రహం
శివుని విగ్రహాల్లో నటరాజు విగ్రహం ఒకటి. దీన్ని ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే నటరాజ విగ్రహం కోపానికి ప్రతిరూపం. దీనివల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువగా గొడవలు పడుతూ.. కోపానికి గురవుతుంటారు. కాబట్టి వీటిని ఇంట్లో ఉంచకూడదు.
భైరవ మహారాజు
భైరవుడు కూడా శివుని ఉగ్ర రూపమే. అయితే ఈ చిత్ర పటాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదని పండితులు అంటున్నారు. దీనివల్ల ఎక్కువగా ఇంట్లో సమస్యలు వస్తాయి.
ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో
శని దేవుని విగ్రహం
శని దేవుని విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టకూడదు. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. శని దేవుడిని కేవలం ఆలయంలో మాత్రమే పూజించాలి. ఇంట్లో పూజిస్తే సమస్యలు తప్పవు.
దేవి కాళి చిత్రపటం
దుర్గాదేవి చిత్ర పటాలను దేవుడి గదిలో పెట్టకూడదు. ఎందుకంటే ఇది దుర్గాదేవి ఉగ్ర రూపం. దీనివల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. మీరు ఈ దేవుళ్లను ఆలయాల్లో మాత్రమే పూజించాలని పండితులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్..ఒక్క క్లిక్ చాలు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.