ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. డార్లింగ్ మొదటి సినిమా రీరిలీజ్

ప్రభాస్ బర్త్ డే కానుకగా ఆయన మొదటి సినిమా 'ఈశ్వర్' గ్రాండ్‌గా రీరిలీజ్‌ కానుంది. ఈ నెల 23న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 22 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ మూవీ మాస్ హీరోగా ప్రభాస్‌కి సూపర్ హిట్ విజయాన్ని అందించింది.

New Update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలి సారి హీరోగా పరిచయమైన చిత్రం 'ఈశ్వర్' మరో సారి అలరించేందుకు ఫ్యాన్స్ ముందుకు రాబోతుంది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.  ‘రీ ఇంట్రడ్యూసింగ్‌ ప్రభాస్‌’ అంటూ వదిలిన 'ఈశ్వర్' రీరిలీజ్ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. 22 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ మూవీ కెరీర్ తొలినాళ్లలోనే ప్రభాస్ కు మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చింది. డైరెక్టర్ జయంత్‌ సి.పరాంజీ తొలిసినిమాతోనే ప్రభాస్ లోని మాస్ యాంగిల్ తో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిన్చారు. ముఖ్యంగా ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో  ట్రెండ్ అవుతూనే ఉంటాయి. 

ఇది కూడా చదవండి: మర్డర్ మిస్టరీ.. థ్రిల్లింగ్ గా కృతి, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్

 

'కల్కి 2'

ప్రస్తుతం ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' పార్ట్ 2 తో బిజీగా ఉన్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించారు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చేస్తున్నారు.  

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల పండగ.. లిస్ట్ ఇదే!

Also Read: వామ్మో ఈ ఆంటీ నక్క తోక తొక్కింది.. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది!

Also Read:  PCOS మహిళల్లో ఆ సమస్య ఉంటే మరింత ప్రమాదమా!

Advertisment
Advertisment
తాజా కథనాలు