తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాది మొత్తం భక్తులు వెళ్తూనే ఉంటారు. ఏ సమయంలో అయిన కూడా ఆలయం రద్దీగానే ఉంటుంది. కొండ దిగువన, పైన పలు కౌంటర్లలో దర్శన టికెట్లు ఇస్తుంటారు. అయిన కూడా ఎప్పటికప్పుడూ టికెట్లు అయిపోతుంటాయి. భక్తులకు ఈజీగా ఉండేందుకు టీటీడీ కూడా ఎన్నో మార్పులు చేస్తుంటుంది.
ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?
వర్ష సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా..
ఈ క్రమంలో నూతన కౌంటర్‌ను టీటీడీ ప్రారంభించింది. తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్‌ను గోకులం సమావేశ మందిరం వెనుక వైపు ప్రారంభించారు. ఈ కౌంటర్ ద్వారా రోజుకి 900 టికెట్లను ఆఫ్‌లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. వర్షం పడినప్పుడు భక్తులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ
ఇలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు మంచి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కౌంటర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే గతంలో టికెట్ కేటాయించడానికి కనీసం నాలుగు నిమిషాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం ఒక్క నిమిషంలోనే భక్తులకు టికెట్ కేటాయించేలా చేస్తున్నారు. మొత్తం ఐదు కౌంటర్ల నుంచి భక్తులు ఈజీగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!
ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు అంగప్రదక్షిణం సేవా టిక్కెట్ల ఈ-డిప్ రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయని కూడా టీటీడీ తెలిపింది. అంగప్రదక్షిణానికి ఆసక్తి ఉన్న భక్తులు ఈ సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. ఒక్క నిమిషం దాటిన కూడా రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేదని టీటీడీ తెలిపింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది కేవలం తిరుపతి అర్బన్, రూరల్, స్థానికుల కోసమేనని టీటీడీ తెలిపింది.
ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం