Saving Tips: భవిష్యత్తు భద్రతకు బలమైన పునాది పొదుపు.. ఇలా ట్రై చేయండి..!!

ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడుల కోసం దాచుకోవడాన్ని పొదుపు అంటారు. ఇది ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్య భద్రత కోసం, వృద్ధాప్యంలో నిరంతర ఆదాయం రావడానికి అనువైన విధంగా ఎంపిక చేసుకోవాలి.

New Update
saving money

saving money

Saving Tips: పొదుపు అంటే డబ్బుని జాగ్రత్తగా వాడుకోవడం, వృధా చేయకుండా ఉండటం మాత్రమే కాదు. ఇది ఒక జీవన శైలి, భవిష్యత్‌కు వేసే బలమైన పునాది. మనం సంపాదించే ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని పక్కన పెట్టడం అనేది ఆర్థికంగా బాధ్యతాయుతమైన నిర్ణయం. సాధారణంగా ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడుల కోసం దాచుకోవడాన్ని పొదుపు అంటారు. ఇది ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా పొదుపు చేయకపోతే.. ఆ సంపాదన ఎంతైనా చాలు కాదు. అనుకోని ఖర్చులు, వైద్య సమస్యలు, పిల్లల చదువులు, పదవీ విరమణ అనంతరం జీవితం వంటి విషయాలన్నీ ముందుగానే ఆలోచించి సిద్ధంగా ఉండాలి. ఇది చిన్న వయసులోనే అలవాటు చేసుకోవాలి. అది క్రమంగా మన జీవన శైలిలో భాగమైపోతుంది.

మంచి ఆదాయాన్ని భవిష్యత్తులో..

ఇరవై ఏళ్ల వయసు నుంచే పొదుపు ప్రారంభించడం చాలా మంచిది. ఆ సమయంలో మీరు నెలకి కొంత మొత్తాన్ని క్రమబద్ధంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ( SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ఆదాయాన్ని భవిష్యత్తులో పొందవచ్చు. ముప్పై ఏళ్లలో ఆదాయం పెరగడంతోపాటు పొదుపు కూడా పెంచడం అవసరం. PPF, EPF లాంటి దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు దృష్టి సారించాలి. నలభై ఏళ్లలో ఆదాయం మరింత పెరుగుతుంది కనుక కనీసం 25% వరకు పొదుపు చేయడం ఉత్తమం. పిల్లల చదువులకు అవసరమైన నిధులను ముందుగానే సిద్ధం చేయాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇది కూడా చదవండి: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!

ఐదు దశాబ్దాలు వచ్చిన తర్వాత పదవీ విరమణ సమీపంలో ఉంటుంది. అప్పటివరకు అప్పులన్నీ తీర్చేసుకొని, భద్రత కోసం పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాన్ని సురక్షిత పెట్టుబడులుగా మార్చుకోవాలి. ఆరోగ్య భద్రత కోసం మెరుగైన బీమా పాలసీలను ఎంచుకోవాలి. వృద్ధాప్యంలో నిరంతర ఆదాయం రావడానికి అనువైన పథకాలను కూడా ఎంపిక చేసుకోవాలి. చివరికి చెప్పాల్సిందంటే.. పొదుపు అనేది కేవలం డబ్బు దాచడమే కాదు. అది భవిష్యత్తును నిర్మించే మార్గం. సరైన ప్రణాళికతో చిత్తశుద్ధితో పెట్టుబడులు పెడితే ఏ ఆర్థిక సమస్యకైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఇప్పుడు తీసుకునే స్మార్ట్ నిర్ణయాలు రేపటి జీవితం కోసం కొండంత భద్రతను ఇస్తాయి.

ఇది కూడా చదవండి: ఈ కూరగాయలను మూతపెట్టి ఉడికించోదా..? రుచితోపాటు ఆరోగ్యానికి హానని తెలుసా..!!

( money saving Tips | money | bank-money)

Advertisment
Advertisment
తాజా కథనాలు