/rtv/media/media_files/2025/10/19/tea-strainer-2025-10-19-20-28-32.jpg)
Tea Strainer
నేటి కాలంలో చాలామంది రోజును ఉదయం టీతోనే ప్రారంభిస్తారు. అయితే నిత్యం వాడే టీ స్ట్రైనర్ (వడపోత) శుభ్రత విషయంలో మాత్రం శ్రద్ధ చూపరు. తరచుగా వాడటం వల్ల స్ట్రైనర్‌లోని రంధ్రాలు మూసుకుపోయి దానిపై మురికి పొరలు పేరుకుపోతాయి. ఎన్నిసార్లు కడిగినా ఈ మురికి వదలదు. జిడ్డుగా మారిన స్ట్రైనర్ వంటగది అందాన్ని పాడు చేయడమే కాక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు మీ పాత మురికి స్ట్రైనర్‌ను శుభ్రం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే..కొన్ని సులభమైన గృహ చిట్కాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి మురికి స్ట్రైనర్‌ను కొత్తదానిలా మెరిపించవచ్చు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మురికి స్ట్రైనర్‌ను శుభ్రం చేసే సులభమైన చిట్కాలు:
నిమ్మకాయ-ఉప్పు (Lemon and Salt): టీ స్ట్రైనర్‌ను శుభ్రం చేయడానికి ఉప్పు- నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. ముందుగా.. స్ట్రైనర్‌పై కొద్దిగా ఉప్పు చల్లి ఒక నిమ్మకాయ ముక్కతో బాగా రుద్దండి. ఆ తర్వాత నీటితో పూర్తిగా కడగాలి. ఈ మిశ్రమం జిడ్డు, మురికిని సమర్థవంతంగా తొలగిస్తుంది.
టూత్ బ్రష్-డిష్‌వాషింగ్ లిక్విడ్ (Toothbrush and Dishwashing Liquid): టూత్ బ్రష్ లేదా డిష్‌వాషింగ్ లిక్విడ్ దాదాపు అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటాయి. స్ట్రైనర్‌పై డిష్‌వాషింగ్ లిక్విడ్ వేసి.. పాత టూత్ బ్రష్‌తో పూర్తిగా రుద్దాలి. బ్రష్ ఉపయోగించడం వల్ల రంధ్రాలలో పేరుకుపోయిన మురికి కూడా శుభ్రమవుతుంది. తర్వాత నీటితో కడిగి ఆరబెట్టండి.
వేడి నీరు- డిటర్జెంట్ (Hot Water and Detergent): ఓ గిన్నెలో వేడి నీరు, డిటర్జెంట్ కలిపి ద్రావణాన్ని తయారుచేయండి. స్ట్రైనర్‌ను ఈ మిశ్రమంలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. వేడి నీరు మురికిని మెత్తబరుస్తుంది. ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది శుభ్రం చేస్తే సులభంగా మెరుస్తుంది.
వెనిగర్- బేకింగ్ సోడా (Vinegar and Baking Soda): ఓ గిన్నెలో వేడి నీరు తీసుకుని అందులో 1 టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమంలో స్ట్రైనర్‌ను 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి. ఈ శక్తివంతమైన మిశ్రమం మొండి పట్టిన మురికిని కూడా సులభంగా తొలగించి స్ట్రైనర్‌ను మెరిసేలా చేస్తుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పాత టీ స్ట్రైనర్‌ను శుభ్రంగా, కొత్తదానిలా ఉంచుకోవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: ఇల్లు సువాసనతో నిండాలంటే ఈ 5 వస్తువులు ఫ్లోర్ తుడిచే నీటిలో తప్పకుండా కలపండి