Horoscope : ఈ రాశివారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు దక్కుతుంది!

ఈరోజు మిథున రాశి వారు వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. వృషభ రాశి వారికి ఆస్తి తగాదాలు చికాకు పుట్టిస్తాయి. ఇతర రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్‌ లో తెలుసుకుందాం..

New Update
Ugadi Rasi Phalalu 2024:ఈ ఏడాది మీన రాశివారికి దిమ్మతిరిగే ఆదాయం..అంచెలంచెలుగా విజయం!

horoscope

Horoscope Today: మేష రాశి వారు  ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు.

వృషభ రాశి వారు  ఈరోజు చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం దక్కదు.ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం బెటర్‌. .నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

Also Read: Rohith: సొంతగడ్డపైనే రోహిత్ రిటైర్మెంట్.. కాబోయే కెప్టెన్ బుమ్రా కాదా!

మిథున రాశి వారు ఈరోజు సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవచింతన పెరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలను అందుకుంటారు.

కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహ రాశి వారు  ఈరోజు చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారు  అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

Also Read: BIG BREAKING: పండగ వేళ తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

కన్య రాశి వారికి ఈరోజు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి.దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.పాతబాకీలు వసూలవుతాయి.ఉద్యోగాల్లో  అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.వ్యాపారంలో  మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

తుల రాశి వారు ఈరోజు దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.ఇంటాబయటా కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.ధన పరంగా చికాకులు తప్పవు.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురయ్యే సూచనలు కనపడుతున్నాయి.

వృశ్చిక రాశి వారు ఈరోజు దీర్ఘకాలిక వివాదాల నుంచి బయట పడతారు.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో దైవదర్శనం చేసుకునే సూచనలు కనపడుతున్నాయి.

ధనుస్సు రాశి వారికి  ఈరోజు దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.చిన్ననాటి మిత్రులను కలిసి  ఆనందంగా ఉంటారు.నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.వృత్తి వ్యాపారాలు  ప్రోత్సాహకరంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

మకర రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు మందగిస్తాయి.కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్పడే సూచనలున్నాయి. వ్యాపారాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలున్నాయి.

కుంభ రాశి వారికి ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు.సోదరులతో ఆస్తి వివాదాలు కలిగే సూచనలున్నాయి.ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.

మీన రాశి వారికి  ఈరోజు సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్త్తృతమవుతాయి.గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు.విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

Also Read: South Korea: అభిశంసనకు గురైనా..ఆ అధ్యక్షుడి జీతం పెరిగిందోచ్‌!

Also Read: Telangana: అత్యవసరమైతేనే తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు