/rtv/media/media_files/2025/03/16/bRrb6m3mhpdUqMPB4HcZ.jpg)
Prostate cancer Photograph: (Prostate cancer)
ప్రస్తుతం రోజుల్లో ఎక్కువ శాతం మంది అబ్బాయిలు మూత్రవిసర్జన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మూత్రవిసర్జన సమయంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. పురుషుల్లో ఏమైనా మూత్రవిసర్జన సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం అది ప్రొస్టేట్ క్యాన్సర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ లక్షణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
మూత్ర విసర్జనలో ఇబ్బంది వస్తే..
తరచుగా మూత్రవిసర్జన, ముఖ్యంగా రాత్రిపూట, మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది, మూత్రం బలహీనంగా లేదా ఆగిపోవడం, మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పి ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. దీంతో పాటు మూత్రం, వీర్యంలో రక్తం ఉన్నా కూడా కాస్త జాగ్రత్త పడాలి. మరికొందరికి కటి ప్రాంతం, నడుము దిగువ భాగంలో ఎక్కువగా నొప్పి ఉంటుంది. ఇవి కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలను సూచిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
పురుషుల శరీరంలో మూత్రాశయం క్రింద ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది. ఇది మూత్రం, స్పెర్మ్ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. అయితే వయసు పెరిగే కొద్దీ, ఈ గ్రంథి పెద్దదిగా పెరగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది కలుగుతుంది. చాలా సందర్భాలలో ఈ గ్రంథి క్యాన్సర్‌గా కూడా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ప్రోస్టేట్ నిర్దిష్ట యాంటిజెన్ అనే రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలి మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!