వైద్య రంగంలో మరో అద్భుతం.. క్యాన్సర్‌కు సరికొత్త చికిత్స

క్యాన్సర్ చికిత్సకు అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. కీమోథెరపీతో పాటు ఫొటోథెరపీని ఒకేసారి చేయడం వల్ల క్యాన్సర్‌ కణతులను నాశనం చేయొచ్చని అంటున్నారు. ఇవి క్యాన్సర్‌ కణాలను పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయని చెబుతున్నారు.

New Update

క్యాన్సర్‌ మహమ్మారికి అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. కీమోథెరపీతో పాటు ఫొటోథెరపీని ఒకేసారి చేయడం వల్ల క్యాన్సర్‌ కణతులను నాశనం చేయొచ్చని అంటున్నారు. ఫొటోథెరపీ చికిత్సలో.. బంగారు నానోపార్టికల్స్‌ను శరీరంలోని క్యాన్సర్‌ కణతుల వద్దకు పంపించి, బయటి నుంచి లేజర్‌ ద్వారా వాటిని వేడి చేస్తారు. ఇవి క్యాన్సర్‌ కణాలను పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయి.

Also Read: వైద్య రంగంలో కొత్త విధానం.. డ్రోన్లతో వైద్య సేవలు ప్రారంభించిన బీబీనగర్ ఎయిమ్స్

మాలిబ్డినం సల్ఫైడ్‌ అనే నిరింద్రియ పదార్థంతో పాటు కీమోథెరపీకి వినియోగించే ఔషధాన్ని కలిపి సూక్ష్మ కణాలను తయారుచేసి క్యాన్సర్ కాణాలపై ప్రయోగిస్తారు. ఇవి లేజర్‌ లైట్‌ను 50 డిగ్రీల సెల్సియస్‌ వేడిగా చేస్తాయి. క్యాన్సర్‌ కణాలను అంతం చేయడానికి ఈ వేడి సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సూక్ష్మకణాలు వేడికి కరిగిపోయి వాటిల్లోని కీమోథెరపీ ఔషధాన్ని విడుదల చేస్తాయట.

Advertisment
Advertisment
తాజా కథనాలు