Symptoms on the tongue: నాలుకపై ఈ లక్షణాలు ఉంటే.. మీకు క్యాన్సర్ సోకినట్లే?

నాలుకపై నొప్పి, మంట, పుండ్లు, తెల్లటి మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలని, వెంటనే చికిత్స తీసుకోకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

New Update
Symptoms on the tongue

Symptoms on the tongue

మారిన జీవనశైలి వల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాలు సరిగ్గా లేని ఫుడ్స్ తినడం వల్ల చిన్న వయస్సులోనే క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే కొందరికి నాలుకపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటివల్ల కూడా క్యాన్సర్ ఉందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే గొంతులో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఇది కూడా చూడండి: Brain Tumor Tips: ఇంట్లోనే ఈ చిన్న పరీక్షతో బ్రెయిన్ ట్యూమర్‌ను గుర్తించొచ్చు.. ఎలా చేయాలో తెలుసా?

తెలుపు, ఎరుపు రంగుల్లో ప్యాచెస్

నాలుకపై తెలుపు, ఎరుపు రంగుల్లో కొందరికి నాలుకపై ప్యాచెస్ ఏర్పడతాయి. తెల్లగా ఉన్న మచ్చలను ల్యూకోప్లాకియా, ఎర్రటి మచ్చలను ఎరిథ్రోప్లాకియా అని అంటారు. అయితే ఇవి క్యాన్సర్‌కు తొలి దశలో లక్షణాలు. ఇవి కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నాలుకపై నొప్పి
కొందరికి నాలుకలో నొప్పి ఉంటుంది. సాధారణంగా ఏదో కొంత సమయం నొప్పి ఉంటే పర్లేదు. కానీ అధికంగా నొప్పి ఉంటే మాత్రం తప్పకుండా నిపుణులను సంప్రదించాలని చెబుతున్నారు.  

నాలుకపై పుండ్లు
నాలుకపై గడ్డలు, పుండ్లు లేదా మందంగా ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్నిసార్లు వాపు వస్తుంది. ఇది కొన్ని రోజులకు తగ్గకపోతే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. 

రక్తస్రావం
కొందరికి కారణాలు లేకుండా నాలుకపై రక్తస్రావం ఏర్పడుతుంది. బ్రష్ చేసేటప్పుడు ఏవైనా దెబ్బలు తగలడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఇలా ఎక్కువగా రక్తస్రావం జరిగితే మాత్రం క్యాన్సర్ సోకినట్లు గుర్తించండి. ఏ మాత్రం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా కూడా ప్రమాదం తీవ్రం అవుతుందని నిపుణులు అంటున్నారు. 

గొంతులో నొప్పి
కొందరికి నాలుక దిగువన గొంతు దగ్గర తీవ్ర రక్తస్రావం, నొప్పి, పుండ్లు వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం క్యాన్సర్ ఉందని గుర్తించండి. ఈ లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం అజాగ్రత్త పడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

నోటిలో మంట

నోటిలో మంట వంటి లక్షణాలు కనిపించినా కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏం కాదులే అని ఆలస్యం చేస్తే మాత్రం ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిలో ఏ లక్షణం కనిపించినా కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించమని నిపుణులు అంటున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Health Tips: మారుతున్న వాతావరణంలో రోగాలు ఇబ్బంది పెడుతున్నాయా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు