దాదాపు ప్రతి ఇంటి వంట గదిలో బంగాళా దుంపలు ఉంటాయి. ఇవి ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని అవసరమైన దానికంటే కాస్త ఎక్కువగానే కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటారు. కొన్ని రోజులకు బంగాళా దుంపలు మొలకెత్తుతుంటాయి. వీటిని తొలగించి వంటకు ఉపయోగిస్తుంటారు చాలా మంది. అయితే, ఇలా చేయడం చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read : వైద్య రంగంలో మరో అద్భుతం.. క్యాన్సర్‌కు సరికొత్త చికిత్స
కొందరు ఈ మొలకలను తొలగించి వంటల్లో వాడుతుంటారు. ఇలా మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ ఉత్పత్తి అవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం విషతుల్యం అవుతుంది. ఫలితంగా వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు లాంటి సమస్యలు వస్తాయి.
Also Read: వైద్య రంగంలో కొత్త విధానం.. డ్రోన్లతో వైద్య సేవలు ప్రారంభించిన బీబీనగర్ ఎయిమ్స్