Sorghum: ఉదయాన్నే వీటిని తీసుకుంటే.. ఆరోగ్య ప్రయోజనాలన్నీ మీకే

ఉదయాన్నే జొన్నలు తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలాగే ఇందులోని పోషకాలు గుండె పోటు వంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా కాపాడుతుంది. డైలీ వీటిని తీసుకుంటే ఆరోగ్యంగా కూడా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

New Update
sorghum

sorghum Photograph: (sorghum)

ఉదయం పూట చిరు ధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. వీటిని ఎక్కువగా పూర్వ కాలంలో తీసుకునే వారు. కానీ ప్రస్తుతం రోజుల్లో వీటిని తీసుకునే వారి సంఖ్య తగ్గుతోంది. అయితే చిరుధాన్యాలను చాలా మంది మొలకలుగా చేసి తింటారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు బలం కూడా చేకూరుతుంది.

ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!

జీర్ణ క్రియని కూడా ఆరోగ్యంగా..

చిరుధాన్యాల్లో జొన్నలను ఉదయం పూట తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. చాలా మంది గోధుమలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ జొన్నలను వాడటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు అన్ని కూడా అందుతాయి. అలాగే జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. 

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్‌ గా ముందుకు దూసుకుపోండి!

ఇందులోని కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. డైలీ జొన్నలను తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే గుండె పోటు వచ్చే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వీటిని డైలీ ఉదయం పూట తీసుకుంటో ఫలితం ఉంటుంది. జొన్నల వల్ల చర్మం కూడా కాంతివంతంగా మెరిసిపోతుంది. చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు.

ఇది కూడా చూడండి: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

ఇది కూడా చూడండి: Puri Jagannadh Golimaar Sequel: పదిహేనేళ్ల తర్వాత పూరీ సినిమాకి సీక్వెల్.. ఈసారి కొడితే బ్లాక్ బస్టరే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు