/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Include-sapota-fruit-in-your-diet.-Find-out-what-happens-jpg.webp)
మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది క్యాన్సర్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్య విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సీజనల్‌గా దొరికే పండ్లను తినాలి. అయితే ఈ సీజన్‌లో దొరికే సపోటా పండ్లను తినడం వల్ల క్యాన్సర్ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
తక్షణమే శక్తి లభించాలంటే?
విటమిన్లు ఎక్కువగా ఉండే సపోటా పండ్లు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. ఇందులో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరంలో ఉంటే విష పదార్థాలను తొలగించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తక్షణమే శక్తిని ఇవ్వడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. నీరసం, అలసట ఉన్నవారు ఉదయం పూట వీటిని తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా
సపోటాలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు, మలబద్ధకం, ఉబ్బరం వంటి వాటిని తగ్గిస్తుంది. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే ఎముకలను బలంగా చేసి బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే ఎక్కువగా తింటే బాడీకి వేడి చేస్తుంది. కాబట్టి కాస్త మితంగానే తినండి.
ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!