Sankranthiకి మీ వాకిట్లో అందమైన రంగవల్లికలు.. ఎవరైనా వావ్ అనాల్సిందే!

సంక్రాంతి పండుగ రోజు మీ వాకిలి రంగులతో కలకలలాడాలంటే కొన్ని ముగ్గులు తప్పకుండా వేయాలి. చాలా మంది సంక్రాంతిని తెలిపేలా ముగ్గులు వేస్తుంటారు. అయితే ఈ అందమైన రంగవల్లికలను మీ వాకిట్లో వేస్తే ఎవరైనా కూడా వావ్ అనాల్సిందే.

New Update
Sankranthi rangoli

Sankranthi rangoli Photograph: (Sankranthi rangoli)

సంక్రాంతి పండుగ అంటే తెలుగు ప్రజలకు ఒక ఎమోషన్. ఈ పండుగ ప్రారంభం కావడానికి ఇంకా నెల రోజులు ఉందంటే.. చాలు అందరి ఇంటి వాకిళ్లు ముగ్గులతో కలకలలాడుతుంటాయి. ఆడపడుచులు అందరూ కూడా వాకిట్లో పేడ కల్లాపు చల్లి.. రంగులతో అందంగా ముగ్గులు వేస్తారు. కొందరు చుక్కల ముగ్గులు వేస్తే మరికొందరు డిజైన్ ముగ్గులు వేస్తుంటారు. రంగులతో ముగ్గులు వేసి మధ్యలో గొబ్బిమ్మలు పెట్టి వాటిని పువ్వులతో అలంకరిస్తారు. అయితే ఈ సంక్రాంతికి మీ వాకిలి రంగులతో అందంగా నిండిపోవాలంటే వేయాల్సిన ముగ్గులు ఏంటో చూద్దాం. 

చుక్కలతో వేయలేని వారు..

చుక్కలతో ముగ్గులు రాని వారు కొందరు చిన్న డిజైన్స్‌తో ముగ్గులు వేస్తారు. సంక్రాంతి పండుగ విశేషాలను తెలిపే విధంగా కొందరు డిజైన్లు వేస్తుంటారు.

సంక్రాంతికి ఎక్కువగా ధాన్యం కుండలు ఉన్న ముగ్గులు వేస్తుంటారు. వీటితో పాటు చెరుకు గడలు ఉండే విధంగా రెండింటిని కలిపి సంక్రాంతి వెలుగులు వచ్చేలా రంగవల్లికలు వేస్తారు. 

పెద్ద డిజైన్స్‌తో ముగ్గులు వేయలేని వారు.. చిన్నగా హ్యాపీ సంక్రాంతి అని రాస్తూ ఇలా కూడా వేసుకోవచ్చు. సంక్రాంతి కుండలు వేస్తూ దాని చుట్టూ చిన్న డిజైన్‌లు వేస్తే ఎంతో అందంగా ఉంటాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు