Free Food: ఈ రైలులో మీరు ఎంత తిన్నా ఫ్రీ.. పైసా కట్టక్కర్లేదు

సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఏళ్ల తరబడి ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. ఈ సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ 39 స్టేషన్లలో ఆగుతుంది. 6 స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఆహారం సిద్ధం చేస్తారు. 3 దశాబ్దాలుగా ప్రయాణికులకు ప్రత్యేక ఆహారం, ప్రసాదాలు ఇస్తున్నారు.

train foods

Free Food

New Update

Train Food: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది ఇంటి నుంచి ఆహారం తీసుకెళ్తారు. కొందరు రైల్లోనే అమ్మేవి కొనుక్కుంటారు. మరికొందరు స్టేషన్‌ వచ్చినప్పుడు దిగి ఫ్లాట్‌ఫామ్‌ మీద కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ ధర కూడా బయటతో పోలిస్తే అధికంగానే ఉంటుంది. దీంతో ప్రయాణికుల జేబులు గుల్ల అవుతుంటాయి. కానీ ఒక రైలులో మాత్రం ఎంత తిన్నా ఉచితంగా ఇస్తారు. అంతేకాదు పార్సిల్‌ కూడా ఇంటికి ఎంత కావాలన్నా తీసుకెళ్లొచ్చు.

రైళ్లలో ప్రయాణికులకు ప్రత్యేక ఆహారం:

ఈ రైలు సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌. ఈ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకులందరికీ ఉచిత ఆహారం లభిస్తుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా రైళ్లలో ప్రయాణికులకు ప్రత్యేక ఆహారం అందిస్తున్నారు. అది కూడా ఉచితంగా. ఈ సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ మొత్తం 39 స్టేషన్లలో ఆగుతుంది. ఆరు స్టేషన్లలో ప్రయాణికులకు ఆహారం అందిస్తారు. ఎంతకావాలన్నా పెడతారు. పార్సిల్‌ కూడా అందిస్తారు. అమృత్‌సర్-నాందేడ్ సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ 29 సంవత్సరాలుగా ప్రయాణీకులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని అందిస్తోంది.

ఇది కూడా చదవండి:  హైదరాబాద్ లో విషాదం.. కుక్కతో ఆడుకుంటూ మూడో ఫ్లోర్ నుంచి..!

రైలులో ప్రయాణించే వ్యక్తులు తమతో పాటు పాత్రలను తీసుకువెళతారు. మొత్తం ప్రయాణం 2081 కిలోమీటర్లు, ఇందులో 6 ప్యాంట్రీలు ఉంటాయి. వీటిలో ఆహారం సిద్ధంచేస్తారు. ప్రజలు ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఆహారం తీసుకోవచ్చు. వాస్తవానికి ఇది చాలా దూరం వెళ్లే రైలు కాబట్టి ఇలాంటి సదుపాయం ఉంటుంది. సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ సిక్కుల రెండు అతిపెద్ద పుణ్యక్షేత్రాలు, అమృత్‌సర్‌లోని శ్రీ హర్మందర్ సాహిబ్, నాందేడ్ (మహారాష్ట్ర)లోని శ్రీ హజూర్ సాహిబ్ సచ్‌ఖండ్‌లను కలుపుతుంది. రైలులో ప్రసాదాలుకూడా అందిస్తారు. కడి-అన్నం, చోలే-రైస్, పప్పు, ఖిచ్డీ-కూరగాయలు ఉంటాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

 

ఇది కూడా చదవండి:  మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం.. పలాసలో..

#food #trian
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe