Hyderabad: హైదరాబాద్ లో విషాదం.. కుక్కతో ఆడుకుంటూ మూడో ఫ్లోర్ నుంచి..!

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఉన్న వివి ప్రైడ్‌ హోటల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కతో ఆడుకుంటూ ఉదయ్‌ అనే వ్యక్తి మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటనలపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
uday

Hyderabad

TG News : హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కుక్క తరమడంతో ఓ యువకుడు హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు.  అయితే ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుక్కతో ఆడుకుంటుండగా బ్యాలెన్స్‌ తప్పి ఉదయ్‌ కిందపడ్డాడు.

సీసీ కెమెరాలో విజువల్స్‌..

దీనికి సంబంధించిన వీడియోలు సీసీటీవీ కెమెరాలో విజువల్స్‌ రికార్డయ్యాయి. ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేందుకు హోటల్‌కు ఉదయ్‌ వెళ్లాడు. అక్కడ కుక్కతో ఆడుకునే క్రమంలో అదుపు తప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

Also Read :  ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎక్కడంటే?

స్థానిక వివరాల ప్రకారం.  తెనాలికి చెందిన ఉదయ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి రామచంద్రపురం అశోక్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సరదాగా స్నేహితులతో గడిపేందుకు చందానగర్‌లోని వివి ప్రైడ్‌ హోటల్లో రూమ్ తీసుకున్నారు. అయితే మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న కుక్కతో ఆడుకుంటూ.. అంటూ ఇటూ పరిగెత్తాడు. ఆ క్రమంలో ఉదయ్.. హోటల్ మూడో అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు. అయితే ఘటనపై  కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అన్నమయ్య జిల్లాలో విషాదం.. బస్సు ఢీకొని ఐదుగురు మృతి

తీవ్ర గాయాలైన ఉదయ్‌ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు  వెల్లడించారు. ఉదయ్‌ మరణించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అంతేకాకుండా ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మూడో ఫ్లోర్‌కి కుక్క ఎలా వెళ్ళింది.. అనేదానిపైన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని.. పరిస్థితిని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: పిల్లలకి ఏ వయసులో ఏ టీకా వేయించాలి?

వరుస ఘటనలు:

నిన్న కోతులు తరమడంతో తప్పించుకొనే క్రమంలో కిందపడి ఓ మహిళ దుర్మరణం చెందింది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యానగర్‌లో  ఉన్న బొంగోని లక్ష్మి తన ఇంటి రేకుల షెడ్డుకింద ఉండగా కోతులమంద వచ్చింది. ఆమె అదిలించగా అవి బెదిరించాయి. వాటి బారి నుంచి తప్పించుకొనేందుకు ఇంట్లోకి పరుగుతీసే క్రమంలో ఆమె జారిపడి సిమెంట్‌ గచ్చుపై పడిపోయింది.  తల వెనుక భాగంలో బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. మృతురాలికి భర్త, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.

Also Read :  నాగార్జునకు తప్పిన ప్రమాదం!

Advertisment
తాజా కథనాలు