Palasa
AP News: పలాసలో అమానుషం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన పలాస జిల్లాలో కలకలం రేపింది. 19వ తేదీన పలాస సూదికొండకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలను బర్త్‌డే పార్టీకి ముగ్గురు యువకులు తీసుకువెళ్లారు. అనంతరం ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి ఇద్దరు యువకులు పాల్పడ్డారు. మూడో మైనర్ బాలిక ప్రతిఘటించడంతో మూడో వ్యక్తి ఆ ఇద్దరి అత్యాచారాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు.
ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు..
ఈ ఘాతుకంలో ఇద్దరు అక్కాచెల్లెల్లు బలైయ్యారు. తల్లిదండ్రులు కూతుర్ల భవిష్యత్తు కోసం ఈ దారుణాన్ని దాచి పెట్టారు. చిన్న కుమార్తెకు ఆరోగ్యం బాగోక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతుగా నిలిచారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: రేవంత్ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే?
గత ప్రభుత్వం హయాంలో పలాస ప్రతిష్టకు భంగం కలిగిందన మండిపడ్డారు. ఆ సంస్కృతికి చెరమగీతం పాడాలన్నారు. మరోసారి ఆడపిల్ల వైపు చూడాలన్నా, వారిపై దాడులకు పాల్పడాలన్నా భయపడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ముగ్గురు నిందితులను వదిలేది లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: చనిపోయే ముందు మాట్లాడే మూడు మాటలు
ఇది కూడా చదవండి: ముఖం చూసి ఆరోగ్యం చెప్పేసే ఏఐ టెక్నాలజీ
ఇది కూడా చదవండి: కరివేపాకు నీటితో ఎంతటి పొట్ట అయినా కరగాల్సిందేనా?